Kushboo: కోలీవుడ్ హీరో అయినప్పటికి టాలీవుడ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయంగ్ సంపాదించుకున్న నటుడు విశాల్. ఈయన తమిళంలో నటించిన ప్రతి ఒక సినిమాలు తెలుగులో కూడా అదే స్థాయిలో విజయాలు అందుకున్నాయి. ఇక ఎప్పుడు ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే విశాల్ ఇటీవల తన సినిమా వేడుకలో హాజరయ్యాడు. కానీ అతని ఆరోగ్య పరిస్థితి చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.
Game Changer : రూమర్లకు చెక్.. “గేమ్ ఛేంజర్” కర్ణాటక బుకింగ్స్ స్టార్ట్
సిక్స్ ప్యాక్ బాడితో ఎప్పుడు స్టిఫ్ గా ఉండే విశాల్ ఒకసారిగా బక్క చిక్కిపోయి కనిపించారు. ఆయన కళ్ల వెంట నీరు కారుతూనే ఉంది అలాగే ఆయన మాట్లాడేటప్పుడు కూడా వణికిపోతూ మాట్లాడటం గమనించవచ్చు. అయితే సమాచారం ప్రకారం విశాల్ గత కొద్దిరోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు వైద్యుల తెలిపారు. కానీ జ్వరం కారణంగా ఒక మనిషి ఇంతలా మారి పోతారా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.
అయితే తాజాగా ఓ ఇంటర్వూలో పాల్గొన్న నటి కుష్భూ విశాల్ అనారోగ్యం పై స్పందించింది.. ‘ ‘మదగజరాజా’ సినిమా దాదాపు 11 సంవత్సరాల తర్వాత విడుదల కాబోతోంది. ఈ మూవీ కోసం విశాల్ చాలా కష్టపడాడు. ట్రైలర్ చూస్తే మీకే అర్ధం అవుతుంది. అందుకనే ఖచ్చితంగా రావాలని విశాల్ ఈ సినిమా వేడుకకు వచ్చాడు. ఆ రోజు విశాల్ డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నారు. దాదాపు 103 డిగ్రీల జ్వరం ఉంది. ఇంత జ్వరంలో కూడా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని నేను అడిగాను. నా సినిమా అందుకని అనారోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా వచ్చాను అన్నారు. కానీ నిజనిజాలు తెలియక కొంత మంది యూట్యూబర్స్ వారి వ్యూస్ కోసం విశాల్ గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు’ అంటూ కుష్బూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Chiranjeevi-Anil Ravipudi: చిరు-అనిల్ సినిమాకు ముహూర్తం ఫిక్స్?