Site icon NTV Telugu

Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్

Kubera

Kubera

Kubera : కుబేర సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ కు, ధనుష్, నాగార్జున యాక్టింగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇందులోని పాటలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. మూవీలోని ‘నాది నాది నాదే ఈ లోకమంతా’ బీజీఎంకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ‘మాది మాది మాదే ఈ సోకమంతా’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దీన్ని ధనుష్ పాత్రను బేస్ చేసుకుని తీశారు. ఈ సాంగ్ లో ధనుష్ మేకోవర్ లుక్ లో కనిపిస్తారు. ఇది ధనుష్‌ పాత్రలో మార్పును ఎక్స్ పోజ్ చేస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది.

read also : Amit Shah: పాశమైలారం పరిశ్రమ ప్రమాదంపై అమిత్ షా రియాక్షన్…

కుబేర మూవీ థియేటర్లలో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తమిళం కంటే తెలుగులోనే భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఇందులో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ కు విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. శేఖర్ కమ్ముల తన కంఫర్ట్ జోన్ దాటేసి తీసిన ఈ సినిమాకు మంచి ఆదరణ దక్కుతోంది. ఇందులో రష్మిక పాత్ర కూడా బలంగానే ఉండటం విశేషం. ఎలాంటి యాక్షన్ సీన్లు లేకుండా కేవలం కథను మాత్రమే బలంగా చూపించాడు శేఖర్. అందుకే ఇందులో హీరోయిక్ సీన్లు లేకుండా కేవలం కథలో అందరూ లీనమై నటించారు అని శేఖర్ కమ్ముల ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. నాగార్జున చాలా ఏళ్ల తర్వాత ఓ డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించారు.

read also : Anupama Parameshwaran : అనుపమ సినిమా.. సెన్సార్ బోర్డు ఆఫీస్ ముందు నిరసన..

Exit mobile version