కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తాజా చిత్రం కుబేర. అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏషియన్ సినిమాస్ సునీల్, రామ్ మోహన్ రావ్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. భారీ అంచనాల మధ్య ఈ నెల 20న విడుదలైన కుబేర సూపర్ హిట్ తెచ్చుకుంది. ముఖ్యంగా ధనుష్ నటన కు మంచి ప్రశంసలు దక్కాయి. అటు నాగార్జున వయసుకు తగ్గ మంచి పాత్ర చేసారని కితాబు వచ్చింది.
Also Read : Vijay 69 : జననాయకుడు రిలీజ్ డేట్ ఫిక్స్..
ప్రశంసలతో పాటు కుబేర కలెక్షన్స్ కు కుమ్మేస్తోంది. రిలీజ్ రోజు మార్నింగ్ షోస్ కాస్త నెమ్మదిగా స్టార్ట్ అయిన మ్యాట్ని నుండి జోరుచూపించి హౌసేఫుల్స్ తో నడిచింది. మొత్తంగా మొదటి రోజు రూ. 27.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి డీసెంట్ స్టార్ట్ అందుకుంది. సూపర్బ్ మౌత్ టాక్ తో రెండవ రోజు అంచనాలను మించి అటు ఇటుగా రూ. 23. 5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అటు బుక్ మై షో బుకింగ్స్ లోను కుబేర జోరు చూపించింది. డే 1 328.42K టికెట్స్ బుక్ అవ్వగా రెండవ రోజు 339.04K టికెట్స్ బుక్ అయ్యాయి. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ బుకింగ్స్ రాబట్టింది కుబేర. ధనుష్ చివరి సినిమా రాయన్ ను కంటే స్పీడ్ గా కుబేర రెండు రోజుల్లోనే రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక నేడు వీకెండ్ కావడంతో 3వ రోజు కూడా అటు ఇటుగా రూ. 20 కోట్ల ఉండే అవకాశం ఉందని ట్రేడ్ అంచనా వేస్తుంది.