సినిమా ఒక రంగుల ప్రపంచం.. ఈ ప్రపంచంలో అందరు తమ ముఖాలకే కాదు మనసుకు కూడా రంగు పులుముకొని బ్రతుకుతుంటారు. వారి నిజమైన ముఖాన్ని చాలా రేర్ గా చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు తమ గత జీవితం తాలుకూ ఆనవాళ్లను కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు.. తమకు నాకిచ్చిన దారిలో రావడానికి ఎన్నో ముళ్లను తొక్కుకుంటూ రావాల్సి ఉంటుందని వారికి తెలుసు.. వాటిని దాటుకొని విజయాన్ని అందుకున్నాకా తమ గత జీవితాన్ని బయటపెడతారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కుబ్ర సైత్ ఎన్నో ఏళ్లు పడిన నరకయాతనను తన బుక్ ద్వారా చెప్పుకొచ్చింది. ‘సాక్రెడ్ గేమ్స్’ వెబ్ సిరీస్ తో ఎంతో పేరుతెచ్చుకున్న ఆమె తన గత జీవితంలో అనుభవించిన చేదు జ్ఞాపకాలను ‘నాట్ క్వైట్ ఎ మెమోయిర్’ అనే బుక్ లో రాసుకొచ్చింది.
“అప్పుడు నాకు 17 ఏళ్లు ఉంటాయి.. బెంగుళూరులో ఉండేవాళ్ళం.. అక్కడ తరుచుగా మా కుటుంబం అంతా ఒక రెస్టారెంట్ కి వెళ్తూ ఉండేవాళ్ళం.. దీంతో ఆ రెస్టారెంట్ ఓనర్ మాకు క్లోజ్ అయ్యాడు.. మా అమ్మతో మాటలు కలిపి అప్పుడప్పుడు అమ్మకు ఆర్థికంగా సాయం చేసేవాడు. ఇంటికి వచ్చినప్పుడు నన్ను తన ఒళ్లో కూర్చోపెట్టుకొని నా తొడలను నిమిరేవాడు.. మా అమ్మ ముందే నన్ను తాకుతూ, ముద్దు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడు.. నేను అంకుల్ అని పిలిస్తే ఆలా వద్దని చెప్పేవాడు.. ఇక ఇవన్నీ ఇంట్లో వారికి ఎప్పుడు చెప్పలేదు.. చెప్తే మా ఇంటికి ఆర్థికంగా సాయం చేసే వ్యక్తి దూరమవుతాడు.. అలా ఓసారి నన్ను హోటల్‌కు తీసుకెళ్లి నా పెదాలపై ముద్దు పెట్టాడు. అతడు చేసిన పనికి షాకయ్యాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ క్షణం గట్టిగా అరవాల్సింది, సాయం కోసం పరిగెత్తాల్సింది. కానీ షాక్‌లో ఉండిపోవడంతో నా నోటి నుంచి చిన్న మాట కూడా పెగల్లేదు.. ఏం చేయాలో తోచని పరిస్థితి.. చివరికి అతడి చేతిలోనే నా వర్జినిటీ కోల్పోయాను.. నా జీవితంలో ఇదే సిగ్గుచేటు రహస్యం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బుక్ నెట్టింట వైరల్ గా మారింది.