Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న కృతి.. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంది. అయితే అవకాశాలను అయితే అందుకుంది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. స్టార్ హీరోల సరసన నటించినా.. ముద్దుగుమ్మకు హిట్స్ అందలేదు. ఇక దీంతోప్రస్తుతం అమ్మడు అందాల ఆరబోతను నమ్ముకుంది. ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచుతూ.. అభిమానులను అలరిస్తుంది. ఉప్పెన సినిమా చేసేటప్పుడు అమ్మడి వయస్సు 17. బాలనటిగా ఎన్నో యాడ్స్ లో కనిపించి మెప్పించిన కృతి.. ఉప్పెనతో హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఈ భామ వయస్సు 19. ఒక పక్క హీరోయిన్ గా నటిస్తూనే ఇంకోపక్క చదువు పూర్తిచేస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఈ భామ గురించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అదేంటంటే.. కృతి శెట్టి.. త్వరలోనే మెగా ఇంటి కోడలుగా మారనుందని వార్తలు గుప్పుమంటున్నాయి.
Sodara Sodarimanulara review: సోదర సోదరీమణులారా రివ్యూ
ఉప్పెన సినిమా సమయంలోనే హీరో వైష్ణవ్ తేజ్ తో కృతి .. ప్రేమలో పడిందని, ప్రస్తుతం ఈ జంట ప్రేమలో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా త్వరలోనే వీరి పెళ్లి కూడా జరగనుందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అస్సలు రూమర్స్ సృష్టించడానికి అయినా ఒక ఆలోచన ఉండాలి. ఆమె వయస్సు ఇంకా 19 మాత్రమే .. ఒకపక్క కెరీర్ , చదువు అంటూ కష్టపడుతుంటే.. పెళ్లి అని రూమర్స్ క్రియేట్ చేసి ఆమెను ఇబ్బందులను గురిచేయడం చాలా నీచమైన పని అని కృతి అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్ధమవుతుందా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం కృతి ఫోకస్ అంతా కెరీర్ మీదనే ఉందని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్ కు ఈ జంట ఫుల్ స్టాప్ పెడుతుందేమో చూడాలి.