ఉప్పెనతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారింది కృతి శెట్టి. చూస్తుండగానే చైల్డ్ ఆర్టిస్టు నుండి హీరోయిన్ మెటీరియల్‌గా ఛేంజ్ అయిన బేబమ్మ ప్రజెంట్ కెరీర్ సంగతి పక్కన పెడితే ఆమె ఎంట్రీ మాత్రం అదుర్స్. కృతి శెట్టి ఏ ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతుందో. ఆ బొమ్మ కచ్చితంగా వంద కోట్లు కొల్లగొట్టాల్సిందే ఒక్కసారే కాదు.. మూడు సార్లు ఆ మ్యాజిక్ జరిగింది. హృతిక్ రోషన్ సూపర్ 30తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి. ఆ సినిమా ఏకంగా రూ. 200 కోట్లను వసూలు చేసింది.
Also Read : Retro : రెట్రో బ్రేక్ ఈవెన్.. సాధ్యమయ్యే పనేనా.?
ఇక వైష్ణవ్ తేజ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చిన ఉప్పెన ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసింది అందరికీ ఎరుకే. ఏ మాత్రం అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని కృతిని ఓవర్ నైట్ స్టార్ బ్యూటీని చేసింది. ఈ సినిమా కోసం వంద కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాత ప్లాపులు రావడంతో ఇతర ఇండస్ట్రీల్లో ఫోకస్ చేస్తుంది. అలా మలయాళంలో చేసిన మూవీ ఏఆర్ఎం. టొవినో థామస్ హీరోగా వచ్చిన ఏఆర్ఎంతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కృతి. 2024లో రిలీజైన ఈ మూవీకి కాసుల వర్షం కురిపించారు మలయాళ ఆడియన్స్. ఈ సినిమా కూడా వంద కోట్లను కొల్లగొట్టింది. ఇలా త్రీ ఇండస్ట్రీల్లో అడుగుపెట్టిన ప్రతి సినిమా హండ్రెడ్ క్రోర్ వసూలు చేయడం యాదృచ్చికమో లక్కో తెలియదు. నెక్ట్స్ తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతొంది. తమిళంలో రెండు చిత్రాలు పార్లల్‌గా చేస్తోంది బేబమ్మ. వా వాతియార్, లవ్ ఇన్స్యురెన్స్ కంపెనీ రెండు షూటింగ్స్ కంప్లీట్ చేసుకున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మరీ వీటిల్లో ఏ మూవీ వంద కోట్లు గొడుతుందో చూడాలి.