బేబమ్మపై మనసు పారేసుకున్నాడట ఓ యంగ్ హీరో. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ బ్యూటీతో రొమాన్స్ చేస్తే హిట్ దక్కుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడట. ఇటీవల కాలంలో వరుస ప్లాపులతో సతమతమవుతున్న ఈ హీరో తన నెక్స్ట్ మూవీలో బేబమ్మ హీరోయిన్ గా కావాలని కోరుతున్నాడట. ఆ హీరో ఎవరు ? ఆ కథేమిటంటే ?
Read Also : Bigg Boss Non-Stop : ఫస్ట్ ఎలిమినేషన్… అనుకున్నదే అయ్యిందిగా !
యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ తాజా చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు” థియేటర్లలో రన్ అవుతోంది. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’లో రష్మిక మందన్న మ్యాజిక్ ఏమాత్రం పని చేయలేదు. దీంతో నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు శర్వా. ‘ఛల్ మోహన్ రంగ’ దర్శకుడు కృష్ణ చైతన్య ఈ ఎంటర్‌టైనర్‌కి దర్శకత్వం వహించనున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ శర్వా నెక్స్ట్ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది. ఇక ఇందులో హ్యాట్రిక్ హిట్ తో అందరినీ ఆకట్టుకుంటున్న కృతి శెట్టి హీరోయిన్ గా నటించే అవకాశం ఉందని బజ్. శర్వానంద్ నిర్మాతలు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించమని ‘ఉప్పెన’ నటిని సంప్రదించారని తెలుస్తోంది.
అయితే కృతి శెట్టి ఇంకా ఈ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ది వారియర్’ వంటి పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్ ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లు రాబట్టింది.