ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్స్ లో బేబమ్మ అకా కృతి శెట్టి ఒకరు. ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ హీరోయిన్ కి యూత్ ఫిదా అయ్యారు. ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కృతి శెట్టితో ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ హోమ్ టూర్ చేసింది. తెలుగు తమిళ్ అనే తేడ లేకుండా సినిమాలు చేస్తున్న కృతి శెట్టి తన హౌజ్ ని ఫాన్స్ ఇచ్చిన ఫోటో ఆర్ట్స్ తో నింపేసింది. ఏ వాల్ చూసిన ఫాన్స్ ప్రెజెంట్ చేసిన పెయింటింగ్స్ మాత్రమే కనిపిస్తాయి. సింపుల్ అండ్ బ్యూటిఫుల్ గా తన హౌజ్ ని మైంటైన్ చేస్తున్న కృతి శెట్టి.. “షూటింగ్స్ లేకపోతే అసలు బయటకి వెళ్లను, ఇంట్లోనే ప్రశాంతంగా పడుకుంటాను. పార్టీలు నాకు అలవాటు లేదు” అని చెప్పింది. అందుకే తన హౌజ్ ని పీస్ ఫుల్ గా ఉండేలా డిజైన్ చేసుకున్నాను అని చెప్పిన కృతి శెట్టి, “నేను వంట చేస్తే అంత తగలబడిపోతుంది, వంట చెయ్యకపోవడమే అమ్మకి నేను ఇచ్చే పెద్ద గిఫ్ట్. టీ, మ్యాగీ చెయ్యడం తప్ప నాకసలు ఏమీ రావని” క్యూట్ గా చెప్పింది.
ఇక కస్టడీ సినిమా విషయానికి వస్తే “వెంకట్ ప్రభు సినిమాలన్నింటిలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, కస్టడీలో నా క్యారెక్టర్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఏ భాషలో సినిమా చేసినా ఆ భాష నేర్చుకునే ప్రయత్నం చేస్తాను, సెట్స్ లో అందరితో అదే భాషలో మాట్లాడతాను. అందుకే నాకు తమిళ్ అండ్ తెలుగు త్వరగా వచ్చాయి. చైతన్యతో నేను యాక్ట్ చెయ్యడం రెండో సారి, తను చాలా కంఫర్టబుల్ యాక్టర్. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుంది” అని కృతి శెట్టి కాన్ఫిడెంట్ గా చెప్పింది. మరి వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఫిల్మ్ కృతి శెట్టికి తెలుగు తమిళ భాషల్లో హిట్ ఇస్తుందో లేదో తెలియాలి అంటే మే 12 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.