Krishna Vamsi: స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ గురించి ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ, అప్పట్లో ఆయన తీసిన సినిమాలు.. రికార్డ్ బ్రేకింగ్స్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సింధూరం, ఖడ్గం, నిన్నే పెళ్లాడతా, రాఖీ.. ఇలా పెద్ద లిస్టే చెప్పొచ్చు. ఇక ఉన్నకొద్దీ జనరేషన్ మారడంతో ఆయన సినిమాలపై అభిమానులకు మోజు తగ్గిపోయింది. ఇక గతఏడాది ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో రంగ మార్తాండ అనే సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ, కలక్షన్స్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం కృష్ణవంశీ అన్నం అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. కృష్ణవంశీ సోషల్ మీడియాకు కొద్దిగా దూరంగా ఉంటాడు. ఎప్పుడో కానీ, అభిమానులతో ముచ్చటించడు. అయితే తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ చేశాడు. వారి అనుమానాలకు, అభిప్రాయాలకు తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు.
ఇక చాలామంది అభిమానులు.. పాత కృష్ణవంశీ కావాలని, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలు తీయాలని కోరగా.. ఇంకా ఇలాంటి సినిమాలు ఇప్పుడు చూస్తున్నారా.. ? అని సెటైర్ వేశాడు. ఇక ప్రస్తుతం సీక్వెల్స్ ట్రెండ్ నడుస్తుండడంతో.. కృష్ణవంశీ తీసిన సింధూరం, ఖడ్గం, రాఖీ సినిమాలకు సీక్వెల్స్ తీయమని అడిగారు. అయితే తనకు సీక్వెల్స్ తీయడం రాదనీ చెప్పడంతో పాటు.. రాఖీ సీక్వెల్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “చాలా కష్టం అండీ … రాఖీ మళ్లీ తీసుకురాలేం…. అదొక అదృష్టం అద్భుతం అంతే… ఇంకోటేదైనా…… సారూప్యంగా కాదు.. శుభమస్తు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
చాలా కష్టం అండీ … రాఖీ మళ్లీ తీసుకురాలేం…. అదొక అదృష్టం అద్భుతం అంతే..,. ఇంకోటేదైనా…… సారూప్యంగా కాదు 🙏❤️ శుభమస్తు https://t.co/DNgIcGnFoR
— Krishna Vamsi (@director_kv) January 2, 2024