తెలుగు సినిమాలని రామ్ గోపాల్ వర్మకి ముందు, వర్మ తర్వాత అని సెపరేట్ చెయ్యాలి. ఇంచు మించి ఇదే ఇంపాక్ట్ ఇచ్చాడు కొరటాల శివ. కమర్షియల్ సినిమాలని కొరటాల శివకి ముందు శివకి తర్వాత అని వేరు చెయ్యోచు. ఎంత పెద్ద కమర్షియల్ సినిమా అయినా సరే ఒక సోషల్ కాజ్ టచ్ ఇస్తూ రైటింగ్ లో తనదైన మార్క్ చూపించిన దర్శకుడు కొరటాల శివ మాత్రమే. శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ ఇలా ఎన్టీఆర్ తో సినిమా తీసినా మహేశ్ బాబుతో సినిమా చేసిన తన మార్క్ ఎలిమెంట్ టచ్ ఇవ్వడం మాత్రం కొరటాల శివ ఏ రోజు వదలలేదు. ఫ్లాప్ అనేదే తెలియని దర్శకుడు, స్టార్ హీరోలకి సాలిడ్ హిట్స్ ఇచ్చిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేశాడు. రామ్ చరణ్ స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. కారణాలేవైనా కానీ ఆచర్య మూవీ దెబ్బకి కొరటాల శివ ఇమేజ్ డ్యామేజ్ అయ్యింది. ఈ సినిమా రిజల్ట్ కొరటాల శివని చాలా బాడ్ చేసింది, పది సినిమాలు వరసగా ఫ్లాప్ ఇచ్చినా రానంత చెడ్డ పేరు కొరటాల శివకి ఆచార్య తీసుకోని వచ్చింది. ఆచార్య ఇంపాక్ట్ దెబ్బకి కొరటాల శివ ఇన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఇప్పుడు కొరటాల శివకి కోల్పోయిన క్రెడిబిలిటీ తిరిగిపొందడం కావలి, ఆడియన్స్ నమ్మకాన్ని మళ్లీ గెలవాలి, తన పని అయిపోలేదు అని ప్రతి ఒక్కరికీ పేరు పేరున ప్రూవ్ చెయ్యాలి. అందుకు ఎన్టీఆర్ ని ఆయుధంగా వాడబోతున్నాడు కొరటాల శివ.
ఆచార్య ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా ఆగిపోతుందేమో అని చాలా మంది చాలా సార్లు అనుకున్నారు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ 30 సినిమా సెట్స్ పైకి వెళ్తోంది. దాదాపు ఏడాది కాలంగా నందమూరి అభిమణులు ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ 30 లాంచ్ గ్రాండ్ గా జరిగింది. ఈ లాంచ్ ఈవెంట్ లో కొరటాల శివ మాట్లాడుతూ… “ఎన్టీఆర్ 30 కథ, భారతదేశ సముద్ర తీరంలోని, ఒక ఫర్బిడన్ లాండ్ లో జరుగుతుంది. ఆ నేలపైన జంతువులకన్నా ఎక్కువగా రక్షులల్లాంటి మనుషులు ఉంటారు. ఎవరు ఎవరికీ భయపడరు. చావుకి కూడా భయపడని వాళ్లు ఒకడికి భయపడతారు. అది నా అన్న ఎన్టీఆర్ కి… జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో ఈ సినిమా చెయ్యడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక కొత్త వరల్డ్ లో ఈ కథ జరుగుతుంది” అని చెప్పాడు. కొరటాల శివ చెప్పిన మాటల ప్రకారం చూస్తుంటే ఎన్టీఆర్ ఈ పాన్ ఇండియా మూవీలో నెవర్ బిఫోర్ పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తాడని అర్ధమవుతుంది. మరి తన కంబ్యాక్ కి కేవలం తెలుగు రాష్ట్రాలకి మాత్రమే కాకుండా పాన్ ఇండియా మొత్తం వినిపించేలా కొరటాల శివ ‘ఎన్టీఆర్ 30’ని రెడీ చేస్తాడేమో చూడాలి.