Kona Venkat: టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలకు ఆయన కథలను అందించాడు. ఇక మధ్యలో కొద్దిగా గ్యాప్ ఇచ్చిన కోనా.. మరోసారి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జనవరి 13 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే కోనా వెంకట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించిన ఆసక్తికరమైన విషయాలనే కాకుండా వ్యక్తిగతమైన విషయాలను కూడా పంచుకున్నాడు. కాలేజ్ రోజుల్లో ఆయన గంజాయి అమ్మిన స్టోరీని అభిమానులకు తెలిపి షాకిచ్చాడు.
“కాలేజ్ చదివే రోజుల్లో నా స్నేహితుడు ఒకరు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వెంటనే అతనివద్దకు వెళ్లి అడుగగా.. గంజాయి పండించాను.. అది అమ్మలేక, చేతిలో డబ్బుల్లేక చనిపోవాలనుకున్నాను అని చెప్పాడు. అతడి కష్టాలను తీర్చాలని.. ఆ గంజాయిని, నేను నా ఫ్రెండ్స్ కలిసి గోవాలో అమ్మడానికి వెళ్ళాం. ఆదిలాబాద్ నుంచి రెండు చెక్ పోస్ట్ లను దాటించి, పోలీసులకు అనుమానం రాకుండా గోవాలో సరుకును అమ్మి అతడికి డబ్బు ఇచ్చాను. అంత రిస్క్ చేసి ఆ పని చేశాను అంటే అప్పట్లో నాది క్రిమినల్ బ్రెయిన్.. ఇప్పుడు అది క్రియేటివ్ బ్రెయిన్ గా మారింది. ఆ సమయంలో నేను దొరికిపోతే నాకు చాలా రిస్క్ అయ్యేది. మా నాన్న డి.ఎస్.పి, తాత గవర్నర్ తాను ఒకవేళ పట్టుబడితే చాలా పెద్ద గొడవ అయ్యేది, కానీ, ఆ సమయంలో నాకు నా స్నేహితుడు, అతని కష్టాలే గుర్తొచ్చాయి. అందుకే అతడి కోసం రిస్క్ చేశాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం కోనా వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.