RRR: ప్రతి ఒక్కరి గుండెలను పిండేసిన పాట.. కొమ్మ ఉయ్యాలా వీడియో రిలీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతనెల విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ సినిమాలోని కొమ్మ ఉయ్యాలా .. కోన జంపాలా సాంగ్ ఎంతటి పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సాంగ్ లో నటించిన మల్లిని ఓవర్ నైట్ స్టార్ కిడ్ గా మార్చేసింది.ఇక సినిమా మొత్తాన్ని మలుపు తిప్పే ఈ సాంగ్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎంతో అందమైన గాత్రంతో.. బ్రిటిష్ దొరసానికి గోరింటాకు పెడుతూ కొమ్మ ఉయ్యాల్లో.. కోన జంపాల్లో అంటూ పాడుతోంది మల్లి.
చిన్నారి వాయిస్, గోరింటాకు నచ్చి.. బ్రిటిష్ దొరసాని ఆమెను తీసుకువెళ్లిపోతుంది.. తల్లిదండ్రులకు దూరమైన ఆ చిన్నారి ఆ బ్రిటిష్ దొరసాని ఇంట్లో బందీలా.. పంజరంలో చిలుకలా తన తల్లిని తలుచుకొని, తన బాధను వెళ్లగక్కుతూ పాడుతుంటే.. ప్రతి ఒక్కరి మనసు చలించక మానదు. ఇక మల్లి కోసం కొమరం భీముడు రంగంలోకి దిగి కూతురు కోసం ఆరాటపడుతున్న తల్లిని.. తల్లి కోసం ఎదురుచూస్తున్న చిన్నారిని ఒక్కటి చేసి అందరి చేత ప్రశంసలు అందుకుంటాడు. వీడియోలో వీటన్నింటిని చూపించడం హైలైట్.. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను చిన్నారి ప్రకృతి రెడ్డి ఎంతో అద్భుతంగా ఆలపించింది. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన వీడియో సాంగ్స్ కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.. మరి ఈ పాట ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
- Krrish 4 : 'క్రిష్ 4' ఆలస్యానికి కారణం అదే?
- LGBT - A Legal Battle: 'ఎల్జీబీటీ'ల ఆక్రందనలపై సినిమా.. జూన్ 19న విడుదల!
https://www.youtube.com/watch?v=eWdEqcIH-Xw
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్‌లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్‌కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్‌లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్‌వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!