Kiran Abbavaram Interview on Rules Ranjann Movie: కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘రూల్స్ రంజన్’ అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. రూల్స్ రంజన్ చిత్రానికి ప్రముఖ నిర్మాత A.M రత్నం కుమారుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మురళీకృష్ణ వేమూరి, దివ్యాంగ్ లావానియా నిర్మించగా వెన్నెల కిషోర్, సుబ్బరాజు, వైవా హర్ష, హైపర్ ఆది, మెహర్ చాహల్, అజయ్, మకరంద్ దేశ్‌పాండే, అతుల్ పర్చురే, అన్నూ కపూర్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక సినిమా రిలీజ్ నేపథ్యంలో బుధవారం విలేఖర్లతో ముచ్చటించిన కథానాయకుడు కిరణ్ అబ్బవరం సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. రూల్స్ రంజన్ టైటిల్ ని బట్టి ఇది రూల్స్ కు సంబంధించిన సినిమా అనుకోవద్దని, ఇది పూర్తి వినోదాత్మక సినిమా అని కిరణ్ చెప్పుకొచ్చారు. సినిమా ప్రమోషన్స్ మొదలైనప్పటి నుంచి నేను ఇదే విషయం చెబుతున్నా, ప్రేక్షకులు ఈ సినిమా నుంచి అన్ లిమిటెడ్ కామెడీని మాత్రమే ఆశించాలని ఆయన అన్నారు. ట్రైలర్‌ని చూసినప్పుడు మీరు ఎలా నవ్వుకున్నారో, రెండు గంటల ముప్పై నిమిషాల రన్‌టైమ్ మొత్తం సిచువేషనల్ కామెడీని చూసి ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారని తాను చెప్పగలనని కిరణ్ అన్నారు.
Kiran Abbavaram: రతికతో కిరణ్ అబ్బవరం పెళ్లి.. షాకింగ్ వీడియో రిలీజ్ !
కామెడీ చిత్రాలు వస్తూనే ఉంటాయి.. రూల్స్ రంజన్ లో కొత్తదనం ఏమిటి?
వెన్నెల కిషోర్, హైపర్ ఆది లాంటి నటులతో తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నా, నా మునుపటి సినిమాలన్నీ సబ్జెక్ట్‌తో నడిచేవి, వాటికి కామెడీ స్కోప్ తక్కువ ఉండేవి. రూల్స్ రంజన్ కథలో సిచువేషనల్ కామెడీ ఉంటుంది, అందుకే మీరు తెలియకుండానే అన్ని పాత్రలతో ప్రేమలో పడతారు, సినిమా అంతా డ్రామా కంటే ఎక్కువగా కామెడీ ఉంటుంది.
సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
మనోరంజన్ ఒక అమాయకపు వ్యక్తి, అతని ఇంటి చుట్టుపక్కల చాలా జాగ్రత్తగా, ఆప్యాయంగా కొంత మంది పిల్లలు పెరుగుతారు, వారికి అన్ని సుఖాలు, సౌకర్యాలు ఉన్నాయి. మరో రంజన్ ఆ విధమైన పెంపకం ఉన్న వ్యక్తి, తనపై ఎవరైనా నిందలు వేసినా ఎలా స్పందించాలో తనకు తెలియదు. అయితే అతను కొన్ని పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, తనను కంట్రోల్ చేసే వ్యక్తులపై రూల్స్ పెడతాడు, సినిమాలో అది చాలా ఫన్ పార్ట్, ఇలా అంతా సజావుగా సాగిపోతున్న టైంలో అతని జీవితంలోకి ఓ అమ్మాయి ప్రవేశిస్తుంది ఈ క్రమంలో మనోరంజన్ రూల్స్ రంజన్‌గా ఎలా మారతాడు? అతని జీవితం ఎంత వినోదాత్మకంగా సాగుతుంది అనేది సినిమాలో చూడాలి.
రత్నం కృష్ణ కథ చెప్పినప్పుడు.. మిమ్మల్ని ఎగ్జైట్ చేసింది ఏమిటి?
2021లో నేను రత్నం కృష్ణను కలిశా, కథ మంచి విజువల్-కామెడీ డ్రామాగా రూపొందే అవకాశం ఉందని అప్పుడే నమ్మాను. సినిమా అంతా సరదాగా సాగిపోతుంది, వెన్నెల కిషోర్ బాలీవుడ్ కాస్టింగ్ డైరెక్టర్ రోల్ చేశారు, ఆయన ప్రతిరోజూ ఒక అమ్మాయిని గదికి తీసుకువస్తాడు. ఈ పార్ట్ చాలా ఫన్ జనరేట్ చేసింది. వైవా హర్ష, సుబ్బరాజు ట్రాక్ లు కూడా ఎంతో కామెడీగా ఉంటాయి.