Kiran Abbavaram : సినిమా రూటు మారుతోందా.. లేదంటే అలా మార్చి జనాల్లో ఏదో ఒక చర్చ జరిగేలా చేద్దామనుకుంటున్నారా.. ఇప్పుడు సినిమా డైలాగులు అంటే ఏదో ఒక బూతు లేకుండా కష్టమే. సాఫ్ట్ గా డైలాగులు చెప్పుకుంటూ పోతే దాన్ని ఎవడు పట్టించుకుంటాడని.. ఏకంగా బూతులుతో డైలాగులు పెట్టేసి టీనేజ్, యూత్ లో ఏదో ఫాలోయింగ్ తెచ్చుకోవాలని ఈ నడుమ చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఓ ఫ్రస్ట్రేషన్ లో కొట్టుమిట్టాడుతున్నట్టు కనిపిస్తోంది. ఆయన సినిమాలు పెద్దగా ఆడట్లేదు. ఆ మధ్య వచ్చిన క సినిమా హిట్ అయింది. దానికి ముందు దాని తర్వాత ప్లాపులే. కిరణ్ కు యూత్ లో సెపరేట్ మాస్ ఫాలోయింగ్ లేదు.
Read Also : Tollywood : ఫస్ట్ సినిమా డిజాస్టర్.. అయినా భారీ సినిమాల్లో ఛాన్స్ లు ఎలా?
దాని కోసమే కాబోలు నేనెందుకు ఓ విజయ్ దేవరకొండలాగా లేదా ఓ విశ్వక్ సేన్ లాగా రఫ్ గా యాక్ట్ చేయొద్దు.. రఫ్ గా మాట్లాడొద్దు అనుకుంటున్నాడేమో. కె- ర్యాంప్ లో దీన్ని ట్రై చేస్తున్నాడు. మొన్న వచ్చిన గ్లింప్స్ చూస్తే ఎవరికైనా షాకింగ్ అనిపించాల్సిందే. ’బుడ్డలు జారుతాయి’.. ’నా మొ.. లా ఉంది’ లాంటి ఘాటు డైలాగులు పెట్టేశారు. మరీ ఇంత బోల్డ్ గా ఇంత నాటుగా బూతు డైలాగులు పెట్టడం చూస్తుంటే.. కిరణ్ ఏదో ఫాలోయింగ్ కోసమో లేదంటే తనకంటూ ఒక సెపరేట్ ట్యాగ్ లైన్ ఉండాలని అనుకుంటున్నాడేమో అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కిరణ్ సినిమాలు అంటే క్లీన్ అంటే గ్రీన్ అన్నట్టు మొన్నటి దాకా ఉండేవి. కానీ ఇప్పుడు రూటు మార్చాడు. తాను కూడా మాస్ ఇమేజ్ ను ట్రై చేయాలనుకుంటున్నాడు. కె-ర్యాంప్ లు హద్దులు చెరిపేసి బూతులు పెట్టేసుకున్నారు. కథలో పాత్ర డిమాండ్ చేస్తే ఆ స్థాయి డైలాగులు వర్కౌట్ అవుతాయేమో. కానీ కావాలని ఇరికించినట్టు పెడితే కష్టమే. ఏదైనా సరే అక్టోబర్18న మూవీ రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది.
Read Also : Janaki V vs State of Kerala : టైటిల్ మార్చిన జానకి సినిమా ట్రైలర్ వచ్చేసింది!