1000 కోట్లు వసూల్ చేసి ట్రేడ్ వర్గాలు కూడా షాక్ అయ్యే రేంజ్ కింగ్ సైజ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ ప్రస్తుతం ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న జవాన్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని స్పీడప్ చేసి సెప్టెంబర్ 7 రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే జవాన్ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతూ ఉన్నాయి. ముందుగా జవాన్ నుంచి వచ్చిన ‘ప్రీవ్యూ’ సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టీజర్ టైపులో రిలీజ్ చేసిన ఈ ప్రీవ్యూ ఎండ్ లో షారుఖ్ గుండులో కనిపించడం, పాత సాంగ్ కి డాన్స్ చేయడంతో ఇండియన్ మూవీ లవర్స్ అంతా ఫిదా అయ్యారు. షారుఖ్ ఖాన్ నెగటివ్ టచ్ ఉన్న రోల్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నార్త్ ఆడియన్స్ కి చాలా బాగా తెలుసు. ఈసారి అది పాన్ ఇండియా ఆడియన్స్ అంతా తెలుసుకోబోతున్నారు.
జవాన్ ప్రీవ్యూ యాక్షన్ మోడ్ లో ఉండి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తే… ఛలోనా సాంగ్ బయటకి వచ్చి యూత్ ని అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పటివరకు జవాన్ సినిమా నుంచి రెండు పాటలు బయటకి వచ్చి రెండూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. జిందా బందా సాంగ్ అయితే నార్త్ లో ట్రెండింగ్ లో ఉంది. జవాన్ నుంచి బయటకి వచ్చిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా మూవీ రన్ టైమ్ లాక్ అయ్యిందని సమాచారం. రెండు గంటల నలభై ఏడు నిమిషాల నిడివితో జవాన్ సినిమా బయటకి రానుందని సమాచారం. ఒక స్టార్ హీరో కమర్షియల్ సినిమాకి ఆ మాత్రం డ్యూరేషన్ లేకపోతే ఆడియన్స్ కి కిక్ ఉండడు. సో జవాన్ సినిమా దాదాపు మూడు గంటల పాటు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయనుందన్నమాట. ఈ సినిమాతో పఠాన్ రికార్డులని జవాన్ గా షారుఖ్ ఖాన్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఈ విషయంలో షారుఖ్ కి షారుఖ్ మాత్రమే పోటీ.