అయిదేళ్ల విరామం తర్వాత పఠాన్, జవాన్ సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. స్టైలిష్ యాక్షన్ సినిమాలతో ఒకే ఏడాదిలో రెండు సార్లు వెయ్యి కోట్లు రాబట్టిన హీరోగా హిస్టరీ క్రియేట్ చేసిన షారుఖ్ ఖాన్… ఇప్పుడు తన ట్రాక్ ని కంప్లీట్ గా మార్చి 2023లో మూడో వెయ్యి కోట్ల సినిమాని ఇవ్వబోతున్నాడు. ఇండియాస్ టాప్ మోస్ట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో షారుఖ్ డంకీ సినిమా చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కలయిక కోసం బాలీవుడ్ దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉంది. అంతటి మోస్ట్ అవైటింగ్ కాంబినేషన్ డంకీ సినిమాతో సెట్ అయ్యింది. ఇల్లీగల్ మైగ్రేషన్ కథాంశంగా తెరకెక్కుతున్న డంకీ సినిమా డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈరోజు షారుఖ్ ఖాన్ బర్త్ డే కావడంతో మేకర్స్… డంకీ టీజర్ ని రిలీజ్ చేసారు.
డంకీ డ్రాప్ 1 అంటూ రిలీజ్ చేసిన ఈ టీజర్ లో కథ చెప్పేసాడు రాజ్ కుమార్ హిరాణీ. ఇంగ్లాండ్ వెళ్లాలి అనుకునే కొంతమంది ఎలాంటి కష్టాలని ఫేస్ చేసారు అనేదే డంకీ కథ. సింపుల్ గా చెప్పాలి అంటే ఇండియా నుంచి ఇంగ్లాండ్ ని ఇల్లీగల్ గా వెళ్లే వాళ్ల ప్రయాణంలో ఎదురయ్యే సమస్యలు ఏంటి అనేది డంకీ కథ. ఇలాంటి కథలని కామెడీగా చెప్తూనే అండర్ కరెంట్ గా ఎమోషనల్ జర్నీని చూపించడంలో రాజ్ కుమార్ హిరాణీ దిట్ట. మరోసారి డంకీ టీజర్ లో డి క్లియర్ గా కనిపించింది. టీజర్ ఓపెనింగ్ లోనే ఎడారిలో నడుస్తున్న మనుషులని, వారిపై జరిగే గన్ ఫైర్ ని చూపించిన రాజ్ కుమార్ హిరాణీ… ఆ తర్వాత టీజర్ టోన్ ని కంప్లీట్ గా కామెడీ యాంగిల్ లోకి మార్చేశాడు.
హార్డీగా షారుఖ్, మనుగా తాప్సి, ఇతర ముఖ్య పాత్రల్లో విక్కీ కౌశల్, బోమన్ ఇరానీ నటిస్తున్నారు. షారుఖ్ ఖాన్ టీజర్ లో చాలా లైవ్లీగా ఉన్నాడు, మాస్ నుంచి కంప్లీట్ గా ట్రాక్ మార్చి రాజ్ కుమార్ హిరాణీ సినిమాల్లో హీరోగా మారిపోయాడు. షారుఖ్ ని ఇలా చూడడం బాలీవుడ్ సినీ అభిమానులకి వింటేజ్ వైబ్స్ ఇవ్వడం గ్యారెంటీ. ఇక టీజర్ లో టెక్నీకల్ ఎలిమెంట్స్ కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ టాప్ నాచ్ లో ఉంది. టీజర్ స్టార్టింగ్ లో “బడీ దూర్ సే ఆయే హై” సాంగ్ ఎమోషనల్ గా ఉంది. సోను నిగమ్ వాయిస్ సాంగ్ ని మరింత స్పెషల్ గా మార్చింది. ఓవరాల్ గా డంకీ టీజర్ కంప్లీట్ రాజ్ కుమార్ హిరాణీ స్టైల్ లో ఉంది. త్వరలో డ్రాప్ 2 అంటూ మరో టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు. మరి క్రిస్మస్ కి డంకీ ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
Coming this Christmas to comfort your hearts… A heartwarming story of friendship, love and being together.
The #DunkiDrop1 is here. #Dunki releases in cinemas worldwide this Christmas 2023. pic.twitter.com/QR842sBAIz
— Red Chillies Entertainment (@RedChilliesEnt) November 2, 2023