ఈ ఏడాది మొదట్లోనే “క్రాక్” చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం రవితేజ “ఖిలాడీ” అనే సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. రమేష్ వర్మ చివరగా “రాక్షసుడు” చిత్రంతో హిట్ అందుకున్నాడు. సత్యనారాయణ కోనేరు “ఖిలాడీ” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవితేజ సరసన మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలకు ముహూర్తం ఖరారైందని మేకర్స్ ప్రకటించారు.
Read Also : “చిరు 155” టైటిల్ రివీల్ చేసిన మహేష్
ఈ రోజు దర్శకుడు రమేష్ వర్మ పుట్టినరోజు. ఈ సందర్భంగా “ఖిలాడీ” నుంచి ఫస్ట్ రొమాంటిక్, మెలోడీ సెప్టెంబర్ 10 న విడుదల కానుందని అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించి ప్రోమో విడుదల చేయబడింది. ప్రోమోలో డింపుల్ హయతి జుట్టు ఆరబెట్టుకునేందుకు బాల్కనీలోకి వచ్చింది. చీరలో ఆమె అందం రవితేజను మైమరిపిస్తుంది. ఆమె జుట్టు నుండి పడిన నీటి బిందువు నేరుగా హీరో మొహంపై పడుతుంది. దేవి శ్రీ ప్రసాద్ ట్యూన్ మూడ్ను సెట్ చేస్తున్నాయి. ఎ స్టూడియోస్, హవిష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన “ఖిలాడీ” టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. కొంతకాలం క్రితం ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది. దీంతో సాంగ్స్, ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.