Keerthy Suresh: చేసిన తప్పే మళ్లీ చేస్తానంటున్న ‘మహానటి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానటి చిత్రంతో జాతీయ అవార్డు అందుకున్న బ్యూటీ కీర్తి సురేష్.. ఏ ముహూర్తాన ఆ సినిమా చేసిందో కానీ అమ్మడికి అప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క మంచి విజయం కూడా దక్కలేదు.. వరుస ప్లాపులు.. ఇటీవల సర్కారు వారి పాట చిత్రంతో కొద్దిగా విజయాన్ని అందుకున్నా.. అది మహేష్ లెక్కలోకి వెళ్లిపోవడంతో మళ్లీ యధాస్థితికి వచ్చేసింది. అయితే మహానటి తరువాత కమర్షియల్ ఫిల్మ్స్ ను వదిలేసి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు సై అంది. అదే ఆమె చేసిన తప్పు అని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు. కథలు ఎంచుకోవడం కీర్తి శ్రద్ద చూపించడం లేదని, లేడీ ఓరియెంటెడ్ అనగానే ఓకే చెప్పేయడంతో అవి ప్రేక్షకులను అలరించడం లేదని టాక్ నడుస్తోంది.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అభిమానులు, సన్నహితులు చెప్పినా వినకుండా మళ్లీ లేడి ఓరియెంటెడ్ చిత్రాలకే రెడీ అవుతుందట మహానటి.. కమర్షియల్ చిత్రాలతో పాటు కథ నచ్చితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కూడా రెడీ అని చెప్తుందంట. ఇప్పటికే అమ్మడి చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి.. ఇవి కాకుండా మరో రెండు చిత్రాలను లైన్లో పెట్టింది. ఇవి పూర్తయ్యే లోపులో లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తే టక్కున ఓకే చెప్తానని స్టేట్మెంట్ కూడా ఇస్తుందట.. ఒక్కసారి దెబ్బ తిని ఉన్నాక కూడా మళ్లీ ఈ ప్రయోగాలు అవసరమా చిన్ని.. అంటూ కోలీవుడ్ అభిమానులు అమ్మడిని ట్రోల్ చేస్తున్నారు. అయినా ఇవేమి తనకు పట్టవని, తాను లేడీ ఓరియెంటెడ్ కు కూడా సై అంటానని కూర్చున్నదట. ఇక కీర్తి తీసుకున్న నిర్ణయానికి ఆమె అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మంచి హీరోల సరసన మంచి పాత్రలు చేయొచ్చు కదా కీర్తి అంటూ ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నారట. మరి అభిమానుల మాట విని కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తుందా..? లేక తనకు ఇష్టమైన లేడీ ఓరియెంటెడ్ కథలకే ప్రాధాన్యత ఇస్తుందో చూడాలి.
Also Read
- Rukmini Vasanth : నివిన్ పౌలీ సినిమాతో మలయాళంలోకి రుక్మిణీ వసంత్ ఎంట్రీ
- Yash - Radhika Engagement: యష్ – రాధికా ఎంగేజ్మెంట్కు 10 ఏళ్లు… రాధికా స్వీట్ పోస్ట్ వైరల్!
- I Am Game: దుల్కర్ సల్మాన్ ‘ఐ యామ్ గేమ్’కు బ్రేక్? ఆగస్టు 20 విడుదలపై కొనసాగుతున్న సస్పెన్స్
- Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
తాజావార్తలు
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్‌మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
-
Doctors Strike : జూనియర్ డాక్టర్ల సమ్మె.. ఏపీ సర్కార్‌కు వైద్యుల అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..