మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం రూపొందనున్న మూవీ “భోళా శంకర్”. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయమే సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం గురించి గత కొన్ని రోజులుగా పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో ముఖ్యంగా సినిమాలో కీర్తి సురేష్ పాత్ర గురించి. కీర్తి సురేష్ ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కనిపించబోతోంది అని రూమర్స్ వచ్చాయి. మేకర్స్ తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి రూమర్స్ ను నిజం చేశారు. నిజంగానే ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. కీర్తి చిరుకు రాఖీ కడుతున్న పోస్టర్ ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు. ఈరోజు రాఖీ పండగ కూడా కావడంతో పోస్టర్ రివీల్ చేయడానికి ఇదే మంచి సమయం అయ్యింది.
Read Also : అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
అంతేకాకుండా “భోళా శంకర్”లో కీర్తి సురేష్ కూడా ప్రధాన పాత్రలో కన్పించనుంది అనే విషయం అధికారికంగా అనౌన్స్ అయ్యింది. కీర్తి సురేష్ సౌత్ లోని అత్యుత్తమ నటీమణులలో ఒకరు. ఆమె చిరు సోదరిగా సరిగ్గా సరిపోతుంది. మహతి స్వర సాగర్ వీడియో కోసం మనోహరమైన సంగీతాన్ని అందించారు. “భోళా శంకర్” టైటిల్, మోషన్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కోల్కత్తా నేపథ్యంలో తెరకెక్కనున్నట్టు పోస్టర్ ద్వారా చెప్పేశారు. పోస్టర్లో హౌరా బ్రిడ్జి తో పాటు పలు చారిత్రాత్మక కట్టడాలు కన్పించడం ఆసక్తిని కలిగించింది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న “భోళా శంకర్” 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది.