అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్

ఈరోజు దేశవ్యాప్తంగా రక్షాబంధన్ పండుగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు అక్కాచెల్లెళ్లు తమ అన్నాదమ్ముల చేతికి రాఖీ కట్టి రాఖీ పండుగను జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ పౌర్ణమి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. “రక్షాబంధన్” పండుగ సోదర సోదరీమణుల ప్రేమ, ఆప్యాయతకు చిహ్నం. సోదరీమణులు తమ సంతోషం, శ్రేయస్సు కోసం రాఖీ రోజున సోదరుల నుదుటిపై బొట్టు పెట్టి స్వీట్లు తినిపిస్తారు. అలాగే అన్నాదమ్ములు కూడా తమ సోదరీమణులకు గిఫ్ట్ లు ఇస్తారు. ఈ పండగ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు తమ అన్నదమ్ములతో, అక్కా చెల్లెళ్ళతో ఈ పండగను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అందులో భాగంగానే అల్లు వారి ఇంట కూడా రాఖీ సెలెబ్రేషన్స్ జరిగాయి. అల్లు అర్హ తన అన్న అయాన్ కు రాఖీ కట్టింది. ఈ క్యూట్ స్టార్ కిడ్స్ కు సంబందించిన పండగ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : “సలార్” అప్డేట్ : రేపు “రాజమన్నార్” రాబోతున్నాడు !

ఇక అల్లు అర్హ అప్పుడే వెండితెర అరంగ్రేటం చేస్తున్న విషయం తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వలో సమంత హీరోయిన్ గా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “శాకుంతలం”తో అల్లు అర్హ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులో ఆమె భరత్ అనే పాత్రలో కనిపించనుంది. అల్లు అయాన్ సినిమా ఎంట్రీ గురించి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. మరివైపు అల్లు అర్జున్ “పుష్ప” చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం “పుష్ప : ది రైజ్” పేరుతో క్రిస్మస్ కు ప్రేక్షకులను పలకరించనుంది.

అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్
అల్లు అర్హ రక్షాబంధన్ సెలెబ్రేషన్స్

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-