సూర్య కెరీర్ లోని బెస్ట్ మూవీస్ లో తప్పక చోటు దక్కించుకునే సినిమా ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ రూరల్ డ్రామా మూవీ తెలుగులో ‘శివపుత్రుడు’గా విడుదలైంది. అయితే, బాలా డైరెక్షన్ లో రూపొందిన ఆ సినిమా తరువాత మళ్లీ చాన్నాళ్లకు ఇద్దరూ చేతులు కలపబోతున్నారు. ఈసారి బాలా డైరెక్టర్ గా తిరిగి వస్తుండగా… సూర్య మాత్రం హీరోగా కాక నిర్మాతగా తరలి వస్తున్నాడు. ఆయన తన బ్యానర్ 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బాలా దర్శకత్వంలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు…
Read Also : దుమ్మురేపుతున్న “దాక్కో దాక్కో మేక”… బన్నీ ఖాతాలో మరో రికార్డు
సూర్య నిర్మాణంలో బాలా డైరెక్ట్ చేయనున్న సినిమాకి హీరోగా అథర్వని అనుకుంటున్నారట. ‘గద్దలకొండ గణేశ్’ సినిమాతో తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు తమిళ యువ హీరో. అయితే, కోలీవుడ్ లో మంచి సక్సెస్ రేట్ ఉన్న ఆయనతో కీర్తి సురేశ్ రొమాన్స్ చేయనుంది. బాలా మూవీలో అథర్వ, కీర్తి జంటగా నటించనున్నారు. సూర్య నిర్మాతగా వ్యవహారిస్తాడు. ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కీర్తి సురేశ్ నెక్ట్స్ తెలుగు తెరపై ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కనిపించనుంది. ఆమె గత చిత్రం ‘రంగ్ దే’ మంచి మార్కులే సంపాదించింది…