2015లో అజిత్ కుమార్ నటించిన తమిళ చిత్రం “వేదాళం” బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఇప్పుడు టాలీవుడ్ లో “వేదాళం” రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సోదరి పాత్రలో నటించడానికి జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్ దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి. ఇప్పుడు మెహర్ రమేష్ దర్శకత్వం వహించనున్న “వేదాళం” రీమేక్ కోసం ఆమె పారితోషికం పెంచినట్లు వినికిడి.
Read Also : లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పై కేసు నమోదు
హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో సోదరి పాత్రలో నటించడానికి కీర్తి సురేష్ రూ.3 కోట్లు డిమాండ్ చేసింది అంటున్నారు. దర్శకనిర్మాతలు కూడా ఆమె డిమాండ్ కు ఒప్పుకుని ఆడినంత చెల్లించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ తో రూపొందనున్న ఈ సినిమా కోసం కీర్తి ఈ ప్రాజెక్ట్ కోసం డేట్స్ కూడా కేటాయించిందట. అక్టోబర్ లేదా నవంబర్‌లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇంతకు ముందు సాయి పల్లవి ఈ పాత్రలో నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ చివరకు మేకర్స్ కీర్తి సురేష్‌ని ఎంపిక చేసుకున్నారు.