Keerthi Suresh : సీనియర్ నటుడు జగపతి బాబుకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపింది. మనకు తెలిసిందే కదా జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ షోకు తాజాగా కీర్తి సురేష్ హాజరైంది. ఇందులో ఆమె మాట్లాడుతూ జగపతి బాబుకు క్షమాపణలు తెలిపింది. తన పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానని.. అందుకే సారీ చెబుతున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. తన ప్రేమ విషయం తెలిసిన అతికొద్ది మందిలో జగపతిబాబు కూడా ఉన్నారని.. ఆయన్ను అంతగా నమ్మాను కాబట్ట్ఏ ప్రేమ విషయం చెప్పానని కీర్తి వివరించింది.
read also : Balakrishna : బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలి.. కార్యకర్తల డిమాండ్
నా పెళ్లి అయ్యే వరకు కూడా నా లవ్ మ్యాటర్ అందరికీ తెలియదు. నాకు క్లోజ్ గా ఉండే కొద్ది మందికి మాత్రమే తెలుసు. జగపతి బాబుకు అన్ని విషయాలు చెప్పేశాను. కానీ ఆయన్ను పెళ్లికి పిలవలేకపోయాను. అందుకే అందరి ముందు సారీ చెబుతున్నాను అంటూ చెప్పుకొచ్చింది కీర్తి. ఆంటోనీ తట్టిల్, నేను పదిహేనేళ్లు ప్రేమించుకున్నాం. మా పెద్దలకు పెళ్లి టైమ్ వరకు చెబుదాం అనుకున్నాం. కానీ నాలుగేళ్ల క్రితమే చెప్పేసి ఒప్పించాం. ఆంటోనీ మొన్నటి వరకు ఖతర్ లో ఉన్నాడు. ఇండియాకు రాగానే ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకున్నాం అంటూ చెప్పుకొచ్చింది కీర్తి సురేష్.
read also : Nude Calls : ఈజీ మనీ కోసం న్యూడ్ కాల్స్, చాటింగ్.. గ్రామాల్లో కొత్త దందా
