అనతి కాలంలోనే తన నటన తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేశ్. దాదాపు అందరి హీరోలతో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత కూడా కెరీర్లో జోష్ తగ్గకుండా, మరింత స్పీడ్ పెంచింది కీర్తి సురేశ్. ఇక ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌తో ముందుకు వస్తోంది. గతంలో నేషనల్ అవార్డ్ గెలుచుకున్న ఆమె, ఇప్పుడు తన పాత్రల ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె మలయాళ స్టార్ ఆంటోనీ వర్గీస్‌తో కలిసి నటిస్తున్న కొత్త సినిమా “తోట్టం” అని టైటిల్ ఫిక్స్ చేశారు.
Also Read : SSMB29 : మహేష్ బాబు – రాజమౌళి మూవీ లాంచ్‌కి ఆల్ స్టార్ సెలబ్రేషన్ ప్లాన్?
ఈ చిత్రానికి యువ దర్శకుడు రిషి శివకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కానుందని సమాచారం. కాగా బుధవారం రోజున సినిమా టీమ్ ఈ టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. కీర్తి సురేశ్ లుక్, యాక్షన్ టోన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ చూసి అభిమానులు ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. గ్లింప్స్‌లో “ఆదేశాలకు అతీతంగా.. సరిహద్దులకు అతీతంగా రాబోతుంది ‘తోట్టం’” అనే లైన్ కనిపించడం ఈ సినిమా ఎంత యాక్షన్ అడ్వెంచరస్‌గా ఉండబోతోందో తెలిపేస్తోంది.
ఇటీవల తన కెరీర్లో కొత్త దిశగా అడుగులు వేస్తోన్న కీర్తి, ఈసారి సాహస సన్నివేశాలతో నిండిన పాత్రలో కనబడుతోంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఎమోషనల్, ఫ్యామిలీ డ్రామాల్లో కనిపించిన ఆమె, ఇప్పుడు ఫుల్ యాక్షన్ రోల్లో కనిపించబోతున్నందుకు అభిమానులు చాలా ఎగ్జైట్‌గా ఉన్నారు. పెళ్లి తర్వాత కెరీర్ స్లో అవుతుందనుకున్న అభిమానులకు కీర్తి ఈ ప్రాజెక్ట్‌తో గట్టి సమాధానం ఇచ్చినట్టే. ఈ సినిమాతో ఆమె మరోసారి ఫీమేల్ సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా సత్తా చాటనుందనే బజ్ జోరుగా వినిపిస్తోంది.