‘లవ్ స్టోరీ’ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ తనయుడు పవన్ సంగీత దర్శకుడయ్యాడు. ఆ సినిమాలోని అన్ని పాటలూ విజయవంతం కావడం ఒక ఎత్తు కాగా ‘సారంగ దరియా’ పాట సృష్టించిన సంచలనం మరో ఎత్తు. విశేషం ఏమంటే తాజాగా పవన్ తో సోనీ మ్యూజిక్, ది రూట్ అసోసియేషన్ సంస్థలు ‘గాంధారి’ అనే పాటను చేయించాయి. పవన్ సమకూర్చిన స్వరాలకు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ రచన చేశారు. అనన్యభట్ దీనిని గానం చేసింది. విశేషం ఏమంటే ఈ పాటను బృంద మాస్టర్ డైరెక్ట్ చేసి నృత్యరీతులు సమకూర్చురు. ఈ ‘గాంధారి’ వీడియో ఆల్బమ్ లో కీర్తి సురేశ్ నటించడం మరో విశేషం. నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన కీర్తి సురేశ్ ఓ తెలుగు పాప్ సాంగ్ లో నటించడం ఇదే మొదటిసారి. ఈ వీడియో రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో బృంద మాస్టర్, సుద్దాల అశోక్ తేజ, పవన్, అనన్యభట్, కీర్తి సురేశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బృంద మాస్టర్ మాట్లాడుతూ ”కీర్తి సురేష్ రియల్లీ సూపర్బ్ డాన్సర్. తనకు నేను పెద్ద ఫ్యాన్‌ని. తను మ్యూజిక్ ఆల్బమ్ చేయడానికి ఒప్పుకోవడం గొప్ప విషయం. తను ఓ రోజు మాత్రమే రిహార్సల్ చేసింది. తనలాంటి కమిట్‌మెంట్ ఉన్న నటి అరుదు. రెండు రోజుల్లో ఈ పాటను షూట్ చేశాం. సింపుల్‌గా ఓ పదంలో చెప్పాలంటే తన డాన్స్‌తో సాంగ్‌ను చింపేసింది. కొరియోగ్రాఫర్, డైరెక్ట్‌గా ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్” అని అన్నారు.
కీర్తి సురేష్ మాట్లాడుతూ ”మ్యూజికల్ వీడియోలో యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. ఇది ఓ ఎక్స్‌పెరిమెంట్‌గా అనిపించింది. రూట్, సోనీ మ్యూజిక్‌కి థాంక్స్. ‘సారంగ దరియా’ తర్వాత ‘గాంధారి’తో వపన్ మరో హిట్ అందుకున్నారు. సుద్దాలగారు అద్భుతంగా పాట రాశారు. బృందగారితో, నేను ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న్పపుడు వర్క్ చేశాను. ఆమె కొరియోగ్రఫీలో వర్క్ చేశాను. ఇప్పుడు ఆమె డైరెక్షన్‌లోనూ పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది. ఈ ఆల్బమ్‌లో భాగమైన టెక్నికల్ టీమ్ ఎంతో కష్టపడ్డారు. అందరికీ థాంక్స్” అని చెప్పారు.