‘లవ్ స్టోరీ’ మూవీతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ తనయుడు పవన్ సంగీత దర్శకుడయ్యాడు. ఆ సినిమాలోని అన్ని పాటలూ విజయవంతం కావడం ఒక ఎత్తు కాగా ‘సారంగ దరియా’ పాట సృష్టించిన సంచలనం మరో ఎత్తు. విశేషం ఏమంటే తాజాగా పవన్ తో సోనీ మ్యూజిక్, ది రూట్ అసోసియేషన్ సంస్థలు ‘గాంధారి’ అనే పాటను చేయించాయి. పవన్ సమకూర్చిన స్వరాలకు జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ…