NTV Telugu Site icon

Bigg boss 6: నాగ్ టార్గెట్‌లో ఒకరు జైలుకు, మరొకరు సింహాసనంపైకి!

Bigboss 6

Bigboss 6

Bigg boss 6: బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్‌, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు. ఇక రెగ్యులర్ నామినేషన్ ప్రక్రియ ద్వారా ఇనయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్ ఈ వారం ఎలిమినేషన్స్ జాబితాలో ఉన్నారు. శనివారం ఎవరినీ సేవ్ చేయని నాగార్జున… అందరి జాతకాలను ఆదివారం తేలుస్తానని చెప్పాడు. పండగ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రమే బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. సో… వీరందరి జతకాలు ఇవాళ తేలతాయి. అయితే నాగ్ నామినేట్ చేసిన ఇద్దరికీ విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి.

Bathukamma Celebrations : అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ లెవల్ కు వచ్చిన కీర్తిభట్, సుదీప, శ్రీసత్యలో… కీర్తి చివరి గేమ్ అయిన ‘బ్లాక్ బస్టర్ కెప్టెన్’ లో తన సత్తాను చాటి హౌస్ కు నాలుగో కెప్టెన్ గా ఎంపికయ్యింది. ఈ సీజన్‌లో మొదటి మూడు వారాలు మగవాళ్ళే (బాలాదిత్య, రాజశేఖర్‌, రాజారెడ్డి) కెప్టెన్స్ కాగా తొలిసారి ఓ లేడీ కంటెస్టెంట్ కెప్టెన్ గా ఫినొలెక్స్ పైప్స్ సింహాసనంపై కూర్చుంది. ఇక నాగార్జున నామినేట్ చేసిన రెండో కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ రెండోసారి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో అతని గేమ్ ఏ మాత్రం బాగాలేదని భావించిన మెజారిటీ సభ్యులు ఈవారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా అర్జున్ ను ఎంపిక చేయడంతో అతను జైలుకు వెళ్ళాడు. గతంలోనూ ఒకసారి అర్జున్ కు జైలుకెళ్ళిన అనుభవం ఉంది. నెత్తిమీద నీటి కుండను నిత్యం పెట్టుకుని ఉండే కీర్తి భట్… మరి కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.

Show comments