Bigg boss 6: నాగ్ టార్గెట్‌లో ఒకరు జైలుకు, మరొకరు సింహాసనంపైకి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bigg boss 6: బిగ్ బాస్ షోలో మొదటిసారి హోస్ట్‌కు ఇద్దరిని నామినేట్ చేసే ఛాన్స్ దక్కింది. దాంతో గత వారం నాగార్జున అర్జున్ కళ్యాణ్, కీర్తి భట్ లను వారి ఆటతీరు బట్టి నామినేట్ చేశారు. ఇక రెగ్యులర్ నామినేషన్ ప్రక్రియ ద్వారా ఇనయా, రేవంత్, ఆరోహి, సూర్య, సుదీప, శ్రీహాన్, గీతు, రాజ్ ఈ వారం ఎలిమినేషన్స్ జాబితాలో ఉన్నారు. శనివారం ఎవరినీ సేవ్ చేయని నాగార్జున… అందరి జాతకాలను ఆదివారం తేలుస్తానని చెప్పాడు. పండగ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రమే బిగ్ బాస్ షో ప్రసారం కానుంది. సో… వీరందరి జతకాలు ఇవాళ తేలతాయి. అయితే నాగ్ నామినేట్ చేసిన ఇద్దరికీ విచిత్రమైన అనుభవాలు ఎదురయ్యాయి.
Bathukamma Celebrations : అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు
Also Read
- Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి - మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
- Srinivasa Mangapuram Trailer: మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసిన జై కృష్ణ!
- Johnny Master - Sekhar Master: టాలీవుడ్లో కలకలం.. జానీ మాస్టర్ - శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
- Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే డ్రీమ్ రోల్ ఇదేనట.. రాజమౌళి పేరు చెప్పి షాకిచ్చిన హీరోయిన్!
కెప్టెన్సీ టాస్క్ ఫైనల్ లెవల్ కు వచ్చిన కీర్తిభట్, సుదీప, శ్రీసత్యలో… కీర్తి చివరి గేమ్ అయిన ‘బ్లాక్ బస్టర్ కెప్టెన్’ లో తన సత్తాను చాటి హౌస్ కు నాలుగో కెప్టెన్ గా ఎంపికయ్యింది. ఈ సీజన్‌లో మొదటి మూడు వారాలు మగవాళ్ళే (బాలాదిత్య, రాజశేఖర్, రాజారెడ్డి) కెప్టెన్స్ కాగా తొలిసారి ఓ లేడీ కంటెస్టెంట్ కెప్టెన్ గా ఫినొలెక్స్ పైప్స్ సింహాసనంపై కూర్చుంది. ఇక నాగార్జున నామినేట్ చేసిన రెండో కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్ రెండోసారి జైలుకు వెళ్ళాల్సి వచ్చింది. హోటల్ వర్సెస్ హోటల్ టాస్క్ లో అతని గేమ్ ఏ మాత్రం బాగాలేదని భావించిన మెజారిటీ సభ్యులు ఈవారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా అర్జున్ ను ఎంపిక చేయడంతో అతను జైలుకు వెళ్ళాడు. గతంలోనూ ఒకసారి అర్జున్ కు జైలుకెళ్ళిన అనుభవం ఉంది. నెత్తిమీద నీటి కుండను నిత్యం పెట్టుకుని ఉండే కీర్తి భట్… మరి కెప్టెన్ గా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..