తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలని ఇచ్చిన బ్యానర్ వైజయంతి మూవీస్. అశ్వినీ దత్ బ్యానర్ నుంచి సినిమా వస్తుంది అది గ్రాండ్ స్కేల్ లో ఉంటుందనే నమ్మకం తెలుగు సినీ అభిమానులందరిలోనూ ఉంది. ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాద్యతని తీసుకున్నారు స్వప్న దత్, ప్రియాంక దత్. స్వప్న సినిమా బ్యానర్ పై కథలని మాత్రమే నమ్మి హీరోల మార్కెట్ కన్నా ఎక్కువ బడ్జట్ అవుతున్నా కూడా సినిమాలు చేస్తున్నారు స్వప్న, ప్రియాంక. ఒక మంచి కథకి ఏం అవసరం? దాన్ని ఎంతగా జనాల్లోకి తీసుకోని వెళ్లాలి అనేది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి సినిమాలు చెయ్యడంలో అశ్వినీ దత్ తగ్గ కూతుర్లుగా నిలిచారు ఈ ఇద్దరు. ఎవడే సుబ్రహ్మణ్యం, జాతిరత్నాలు, సీతారామం సినిమాలతో యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఒక మలయాళ హీరో, హిందీ హీరోయిన్ ని పెట్టుకోని సీతారామం లాంటి సినిమాని తెలుగు ఆడియన్స్ ఆదరించారు అంటే అది స్వప్న, ప్రియాంక, అశ్విని దత్ బ్యానర్ నుంచి వచ్చిన సినిమా అనే నమ్మకం.
ప్రస్తుతం ప్రభాస్ తో ‘ప్రాజెక్ట్ K’ లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తున్న ఈ బ్యానర్ నుంచి బయటకి వచ్చిన చిన్న సినిమా ‘అన్నీ మంచి శకునములే’. నందినీ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు. ఇటీవలే థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీపై డివైడ్ టాక్, యావరేజ్ రివ్యూస్ వినిపిస్తున్నాయి. రీసెంట్ జరిగిన ‘అన్నీ మంచి శకునములే’ థాంక్యూ మీట్ లో స్వప్న దత్ మాట్లాడుతూ… “ఈ సినిమాని మేము డబ్బులు చేసుకోవడానికి చెయ్యలేదు. మా అన్ని సినిమాలు క్రిటిక్స్ కి నచ్చాయి, ఈ మూవీ మాత్రం నచ్చలేదు. క్రిటిక్స్ కి నచ్చలేదు కానీ థియేటర్స్ కి వెళ్లి చూస్తే ఆడియన్స్ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లెంగ్త్ ఎక్కవ ఉంది, స్లో పేస్ లో ఉంది అనే ఫీడ్ బ్యాక్ ని తీసుకుంటాం. ఈ రివ్యూస్ ని పక్కన పెట్టి మీ ఫ్యామిలీతో మా సినిమాని థియేటర్స్ కి వచ్చి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది” అని చెప్పింది. ప్రియాంక దత్ కూడా “సినిమాని ఒకసారి థియేటర్స్ మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి, తప్పకుండా నచ్చుతుంది” అని మాట్లాడింది. మరి ఈ ఇద్దరు ప్రొడ్యూసర్ల మాటలని మూవీ లవర్స్ ఎంతవరకూ యాక్సెప్ట్ చేసి థియేటర్స్ కి వెళ్తారో చూడాలి.
We are proud of the story we told! Please give it a shot. You won’t regret it.
– Producer @SwapnaDuttCh speech at #AnniManchiSakunamule Thank You Meet ✨@santoshsoban #MalvikaNair #NandiniReddy @MickeyJMeyer @SwapnaCinema @VyjayanthiFilms @SonyMusicSouth pic.twitter.com/gtqusWtSK6
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 21, 2023