Kayadu Lohar: “అదృష్టం అంటే ఈమెదే.. మొదటి సినిమా దెబ్బతిన్నా చేతిలో రెండు భారీ ప్రాజెక్టులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా కొందరు నటీనటులకు అదృష్టం అలా కలిసి వస్తుంటుంది. సరిగ్గా ఇదే విషయం ఇప్పుడు హీరోయిన్ కయాదు లోహర్ విషయంలో నిజమవుతోంది. ఇటీవలే తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఫంకీ’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయినప్పటికీ, ఈ భామకు మాత్రం టాలీవుడ్లో అవకాశాలు క్యూ కడుతున్నాయి. సాధారణంగా మొదటి సినిమా ఫ్లాప్ అయితే హీరోయిన్లకు అవకాశాలు రావడం కష్టం. కానీ కయాదు లోహర్ తన గ్లామర్ మరియు నటనతో ఇండస్ట్రీ వర్గాలను ఆకర్షించగలిగింది. అందుకే, ఆమె ఖాతాలో ఇప్పుడు వరుసగా ఆఫర్లు వచ్చి చేరుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, కయాదు ఇప్పటికే రెండు కొత్త చిత్రాలకు సంతకం చేసిందట. ఈ రెండు కథలు కూడా వైవిధ్యంగా ఉండటంతో పాటు ఆమె పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమాల సక్సెస్‌తో సంబంధం లేకుండా కయాదుకు ఉన్న డిమాండ్ చూసి ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.
Also Read:Tollywood Excusive: సినిమా హిట్ అయితే హీరో హీరోయిన్లకు నేము, ఫేము.. మరి ప్లాప్ అయితే!
Also Read
- Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
- Yash Favorite Songs: తెలుగులో రాకింగ్ స్టార్ యశ్‌కి ఫేవరెట్ సాంగ్స్ ఇవేనట! లిస్ట్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాట..
- Yash: కేజీఎఫ్ 2 సక్సెస్ తర్వాత హైదరాబాద్ ఎందుకు రాలేదో చెప్పిన యశ్.. అసలు కారణం ఇదేనట!
- NBK 111 : బాలయ్య - గోపిచంద్ మలినేని సినిమా రిలీజ్ డేట్ ఇదే
కొత్త సినిమాల కోసం ఆమె భారీగానే డిమాండ్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఒక్కో సినిమాకు కయాదు సుమారు కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అడుగుతున్నట్లు సమాచారం. వరుస అవకాశాలు వస్తుండటంతో, నిర్మాతలు కూడా ఆమె అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు వెనకాడటం లేదట. తక్కువ కాలంలోనే టాలీవుడ్లో కోటి రూపాయల క్లబ్లో చేరడం అంటే మామూలు విషయం కాదు. తన క్రేజ్‌ను పక్కాగా క్యాష్ చేసుకుంటూ కయాదు దూసుకుపోతోంది. కయాదు లోహర్ ప్రస్తుతం సంతకం చేసిన ఈ రెండు సినిమాలు గాని బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంటే, ఆమె రేంజ్ మరింత పెరగడం ఖాయం. ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న హీరోయిన్ల కొరత కూడా ఈమెకు ప్లస్ పాయింట్‌గా మారుతోంది. మరి ఈ క్రేజీ ఆఫర్లతో కయాదు తన లక్ మార్చుకుంటుందో లేదో చూడాలి!
తాజావార్తలు
-
Zombie Reddy 2: ‘జోంబీ రెడ్డి’ సీక్వెల్ వచ్చేస్తోంది..ఈసారి తేజ సజ్జా రచ్చ మామూలుగా ఉండదు!
-
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
-
Trump: ఇరాన్‌పై ట్రంప్ సరికొత్త యుద్ధం.. సముద్రం నుంచి భూమి వరకు పన్నిన భారీ వ్యూహం ఇదే!
-
CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..
-
Honey Trap : రాజమహేంద్రవరంలో హనీ ట్రాప్ కలకలం.. నలుగురు మహిళలు అరెస్ట్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!