బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఈరోజు జరగనుంది. నిన్న వారి సంగీత్ ఫంక్షన్, మెహందీ వేడుకలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీరి పెళ్లికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సినీ ప్రియులు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటి వరకు వీరి వివాహ వేడుకల నుండి ఓ వీడియో కూడా లీక్ అయినట్టు ప్రచారం జరిగింది. అయితే తాజాగా కత్రినాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు కత్రినా మెహందీ వేడుక ఫొటోలే అనే ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ పిక్స్ లో కత్రినా బంగారు అంచుతో పాస్టెల్ ఆకుపచ్చ కంజీవరం చీరను ధరించింది. ఆమె చేతులపై అందమైన మెహందీ ఉంది. పిక్స్ లో ఆమె వేడుకలను చాలా ఎంజాయ్ చేస్తూ కనిపిస్తుంది. అయితే ఇవి నిజంగా కత్రినా మెహందీ వేడుక నుండి లీకైన ఫోటోలు కాదు.
Read Also : “ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్
సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఈ ఫోటోలు వాస్తవానికి ఒక జ్యువెలరీ బ్రాండ్ యాడ్ కు సంబంధించినవి. పెళ్లి నుంచి ఎలాంటి ఫోటోలు, వీడియోలు లీక్ కాకుండా పక్కా ప్లాన్ తో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు వెడ్డింగ్ నిర్వాహకులు. కాగా కత్రినా, విక్కీ తమ వివాహ ఫోటోల ప్రత్యేక హక్కులను ఒక అంతర్జాతీయ మ్యాగజైన్‌కు ఇచ్చారు. అంతేకాదు ఈ జంట వివాహాన్ని ఓ పాపులర్ ఓటిటి దిగ్గజంలో ప్రసారం చేయనున్నట్లు కూడా చెబుతున్నారు, దీని కోసం వారికి సదరు ఓటిటి సంస్థ రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్టు టాక్ నడుస్తోంది