“ఆర్ఆర్ఆర్” రికార్డుల వేట స్టార్ట్… లాంగెస్ట్ ట్రైలర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకుల నిరీక్షణ అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఫలించింది. సినిమా నుంచి 4 సౌత్ ఇండియన్ వెర్షన్‌ల ట్రైలర్‌లు మొదట దక్షిణ భారతదేశంలోని అనేక టాప్ థియేటర్లలో ప్రదర్శించారు. తరువాత కొన్ని క్షణాల్లోనే… ఈరోజు సాయంత్రం 4 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయాల్సిన ట్రైలర్ ను ఉదయం 11 గంటలకే రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహం, ఇంట్రడక్షన్ సీన్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకుల అంచనాల మేరకు ఆకట్టుకున్నాయి. గ్రాండ్ గా ఉండి, గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఈ ట్రైలర్ విడుదలతోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ఏడాది టాలీవుడ్ లోని భారీ సినిమాల్లో లాంగెస్ట్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది.

Read Also : ‘ట్రిపుల్ ఆర్’ ట్రైలర్ తో దద్దరిల్లిన థియేటర్లు!

టీమ్ “ఆర్ఆర్ఆర్” సోషల్ మీడియాలో సినిమా ట్రైలర్ 3:07 నిమిషాల వ్యవధిని కలిగి ఉంటుందని వెల్లడించింది. సాధారణంగా చాలా భారతీయ సినిమా ట్రైలర్‌లు 3 నిమిషాల కంటే తక్కువ నిడివిని కలిగి ఉంటాయి. 187 సెకన్ల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ఖచ్చితంగా ఇటీవలి కాలంలో భారతీయ సినిమాల్లో వచ్చిన అత్యంత లాంగెస్ట్ ట్రైలర్ అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ ప్రేక్షకులకు “ఆర్ఆర్ఆర్” ప్రపంచంలో థ్రిల్ రైడ్‌ అందిస్తుంది.

బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్, అలియా భట్, కోలీవుడ్ నటుడు సముద్రఖని, శ్రియ, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. “ఆర్ఆర్ఆర్”ను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles