యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో “18 పేజెస్”, “కార్తికేయ-2” చిత్రాలు ఉన్నాయి. ఇప్పటికే “18 పేజెస్” మూవీ షూటింగ్ పూర్తయి పోయింది. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం “కార్తికేయ-2” చేస్తున్నాడు నిఖిల్. 2014లో చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా ఈ మూవీ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ “కార్తికేయ-2” అని పిలుస్తున్నారు. అయితే “దైవం మనుష్య రూపేన” అనే టైటిల్ ను ఈ చిత్రానికి లాక్ చేశారని టాక్ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ ధర పలికినట్లు సమాచారం.
Read Also : లతాజీ అంత్యక్రియలకు ప్రధాని… రంగంలోకి దిగిన సీఎం
జీ స్టూడియోస్ “కార్తికేయ 2” అన్ని భాషల శాటిలైట్, డిజిటల్ హక్కులను 16.50 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఈ ఒప్పందం కొంతకాలం క్రితం జరిగినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. కాల భైరవ సంగీతం అందించారు. “కార్తికేయ 2″లో గ్రాండ్ సెట్ లలో రూపొందడమేకాక అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉండబోతున్నాయి. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబోట్ల నిర్మిస్తున్నారు. మేలో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.