Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Radha Krishna: ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తన ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణుల ప్రేమకథ నేపథ్యంలో ఒక భారీ మైథలాజికల్ డివైన్ ఎపిక్ ను నిర్మించబోతున్నారు. కృష్ణాష్టమి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఈరోజు ఆఫీషియల్ ప్రకటించారు. ఈ మూవీకి ‘రాధాకృష్ణ’ (Radha Krishna) అనే పేరును కూడా ఖరారు చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమలో ‘అవనే శ్రీమన్నారాయణ’ సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న దర్శకుడు సచిన్ రవి ఈ మూవీకి దర్శకత్వ బాధ్యతలను చేపట్టనున్నారు. ఇప్పటివరకు ఎక్కువగా రోమాంటిక్, ఫ్యామిలీ డ్రామాలతో నిర్మించిన కరణ్ జోహార్, ధర్మా ప్రొడక్షన్స్ ఒక పురాణ కథాంశాన్ని ఇంతటి భారీ కాన్వాస్‌పై దృశ్యకావ్యంగా తీసుకురాబోతుండటం విశేషం.
ఇందులో భగవాన్ శ్రీకృష్ణుడి జననం నుండి కంస వధ వరకు సాగే ఆయన ప్రయాణాన్ని ఆవిష్కరించనున్నారు. అయితే ఇందులో ప్రేమకథే హైలెట్ గా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX), అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, హృదయాన్ని హత్తుకునే సంగీతంతో విజువల్ వండర్‌గా దీనిని తీర్చిదిద్దేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఇందులోని ప్రధాన నటీనటుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.
Also Read
- Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
- Siva Nirvana: తమిళ స్టార్‌తో ‘ఇరుముడి’ డైరెక్టర్ సినిమా.. ఈ కాంబో నిజమైతే మామూలుగా ఉండదు!
- Suriya 50: సూర్య 50వ సినిమాగా 'రోలెక్స్'.. లోకేష్ కనగరాజ్‌తో ఆ క్రేజీ కాంబో ఫిక్స్ అయినట్టేనా?
- The Traitors India Season 2: ట్రేటర్లే విజేతలు.. రూ.66 లక్షలు ప్రైజ్ మనీని కొట్టేసిన కిలాడి భామలు!
మొత్తంగా చూస్తే రాధాకృష్ణుల దివ్య ప్రేమకథను కృష్ణుడి జననం నుంచి కంస సంహారం వరకు సాగిన ప్రయాణంతో ముడిపెట్టి ఒక భారీ సినిమాటిక్ అనుభూతిగా అందించాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహార్ లాంటి నిర్మాత, ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడు సచిన్ రవి కలయికలో ఈ ప్రాజెక్ట్ రావడం మాత్రం ఇప్పటికే బజ్ పేరుగుతుండగా, ఇందులో రాధ, కృష్ణ పాత్రల్లో ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన అతిపెద్ద ప్రశ్నగా మారింది. మరి ఈ వివరాలు తెలిశాక సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగే అవకాశం ఉంది.
- Tags
- cinema
- Radha Krishna
తాజావార్తలు
-
Radha Krishna: రాధాకృష్ణులపై కరణ్ జోహార్ భారీ మైథలాజికల్ ఎపిక్.. ‘అవనే శ్రీమన్నారాయణ’ దర్శకుడితో బిగ్ ప్లాన్!
-
Prabhas Fauzi: డార్లింగ్ ఫ్యాన్స్ ఇక తగ్గేదేలే.. ‘ఫౌజీ’ ప్రమోషన్స్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్!
-
TCL P80, P80 Pro: 8GB RAM.. 50MP కెమెరా.. IP68! TCL P80, P80 Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
BCCI-Team India: గౌతమ్ గంభీర్, శుభ్‌మన్ గిల్ కీలక విజ్ఞప్తి.. మాస్టర్ ప్లాన్ వేసిన బీసీసీఐ!
-
Indian Air Force: పాక్ బోర్డర్లో గర్జనకు సిద్ధమౌతున్న భారత వాయుసేన.. బిగ్ వార్ ప్రిపరేషన్‌కి రెడీ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!