Kara Movie OTT: ఓటీటీలోకి వచ్చేసిన ధనుష్ హీస్ట్ ఇంటెన్స్ థ్రిల్లర్… ఐయండిబిలో 8.2 రేటింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kara Movie OTT : సినిమాల్లో దొంగల కథలు కొత్తవి కావు. ఎమోషన్స్ తో కూడిన థ్రిల్లర్ లాంటి కథలు ప్రేక్షకుల మనసుల్లో మరింత బలంగా ముద్ర వేస్తాయి. ఇప్పుడు తమిళ సినిమా నుంచి అలాంటి ఇంటెన్స్ క్రైమ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘కారా’ (Kara). 1990ల కాలం నేపథ్యంలో బ్యాంకుల అప్పులు, వాటిని తీర్చలేక ఒక వ్యక్తి నేర ప్రపంచంలోకి అడుగు పెట్టే పరిస్థితులను ఈ సినిమా చాలా రియలిస్టిక్‌గా చూపించే ప్రయత్నం చేసింది. థియేటర్లలో విడుదలై మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2026 ఏప్రిల్ 30న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన తర్వాత విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద కూడా సుమారు రూ.40 కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఈరోజు (మే 28) నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తమిళంతో పాటు హిందీ, తెలుగు ఇతర భాషల్లో ఇది అందుబాటులోకి వస్తుండటంతో దక్షిణాది ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
Also Read
‘కారా’ కథ ఏమిటంటే ?
ఈ కథ మొత్తం ‘కరసామి’ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అందరూ అతన్ని ‘కారా’ అని పిలుస్తుంటారు. వృత్తిరీత్యా దొంగ అయిన అతను తన సన్నిహితుడు మురుగేశన్‌తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ జీవితం గడుపుతుంటాడు. ఒక ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసిన తర్వాత లైన్‌మ్యాన్‌గా మారువేషం వేసుకుని తప్పించుకునే సన్నివేశాలు సినిమాలో ఉత్కంఠను పెంచుతాయి. అయితే ఒక దశలో నేర జీవితానికి ముగింపు పలకాలని భావించిన కారా సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అప్పటికే అప్పుల బారిన పడిన అతని కుటుంబ పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. డబ్బుల కోసం బ్యాంకు లోన్ తీసుకున్న తర్వాత… ఆ అప్పు చెల్లించలేకపోవడంతో అతని పూర్వీకుల భూమినే బ్యాంకు సీజ్ చేస్తుంది. అదే సమయంలో అతని జీవితం మళ్లీ నేరాల బాట పట్టేలా చేస్తుంది.
సినిమా అసలు కథ అక్కడి నుంచే మొదలవుతుంది. ఒక మనిషి తన కుటుంబ ఆస్తిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్లగలడనే కోణాన్ని దర్శకుడు విఘ్నేష్ రాజా చాలా ఎమోషనల్‌గా, అదే సమయంలో థ్రిల్లింగ్ టోన్‌లో చూపించాడు. ముఖ్యంగా ధనుష్ నటన ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అతని పాత్రలో కనిపించే కోపం, నిరాశ, తిరుగుబాటు ఎమోషన్స్ ప్రేక్షకులను కథలో పూర్తిగా ముంచేస్తాయి.
ఐయండిబిలో 8.2 రేటింగ్
ఇందులో మమితా బైజు హీరోయిన్గా నటించగా, సీనియర్ నటుడు కె.ఎస్. రవికుమార్ కీలక పాత్రలో మెప్పించాడు. సూరజ్ వెంజురమూడు, శ్రీజ రవి తదితరులు కూడా కథకు బలం చేకూర్చారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం 1990ల వాతావరణాన్ని అద్భుతంగా తెరపైకి తీసుకువచ్చింది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. థియేటర్లలో మంచి స్పందన తెచ్చుకున్న ఈ మూవీకి IMDbలో 8.2 రేటింగ్ రావడం కూడా దాని ప్రభావాన్ని చూపిస్తోంది. గ్రామీణ క్రైమ్ డ్రామాలు, ఎమోషన్స్ తో కూడిన థ్రిల్లర్ కథలు ఇష్టపడే వారికి ‘కారా’ ఇప్పుడు ఓటీటీలో తప్పక చూడాల్సిన సినిమాగా మారుతోంది.
తాజావార్తలు
-
Mumbai: భార్యకు తెలియకుండా ప్రియురాలితో విదేశీ టూర్.. సీన్ కట్ చేస్తే..!
-
DUSU Elections: ఢిల్లీ యూనివర్సిటీలో ABVP విజయం.. జెన్-జీ తర్వాత తొలి తీర్పు
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
The Paradise: నైజాంలో ‘ది ప్యారడైజ్’ టికెట్ హైక్స్ దాదాపు ఫిక్స్ ? ఇక జీవో కాపీయే తరువాయి..
-
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!