Kantara: ఐఎండీబీ రేటింగ్స్‌లో ‘కాంతార’ సంచలనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kantara Movie: ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే హిందీ చిత్రసీమనే అనే భావన ఉండేది. దానిని బెంగాల్ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే చెరిపేశారు. ఇక దక్షిణాది సినిమా అంటే ‘మదరాసీ చిత్రం’ అనే పేరుండేది. ఎందుకంటే అప్పట్లో దక్షిణాది నాలుగు భాషల చిత్రాలకు మదరాసే కేంద్రం. ఇప్పుడు సౌత్ సినిమా అంటే తెలుగు చిత్రాలదే పైచేయి అయినా ఐఎండీబీ రేటింగ్స్‌లో కన్నడ సినిమాలు సంచలనం సృష్టిస్తూ ఉండడం విశేషం. ఇటీవల తెలుగులోనూ విడుదలై సంచలన విజయం సాధించిన ‘కాంతార’ కన్నడ సినిమా ఐఎండీబీ రేటింగ్స్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు ఏకంగా 9.5 రేటింగ్ లభించింది. ఇక కన్నడలోనే ‘777 ఛార్లీ’ చిత్రం 9 పాయింట్స్, మూడోస్థానంలో నిలచిన ‘డోళ్ళు’ 8.8 పాయింట్స్ తోనూ, ‘గురుశిష్యరు’ 8.6తోనూ, ‘కేజీఎఫ్-2’ 8.4 పాయింట్స్ తోనూ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి.
ఇక తమిళ చిత్రాల విషయానికి వస్తే.. కమల్ హాసన్ ‘అన్బే శివమ్’ 8.7 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలచింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికి 19 ఏళ్ళవుతూ ఉన్నా, ఇంకా అగ్రస్థానంలో సాగుతూ ఉండడంతో నంబర్ వన్ ప్లేస్ దక్కించుకుంది. గత సంవత్సరం విడుదలైన సూర్య ‘జై భీమ్’కు 8.9 పాయింట్స్ ఉన్నా, రెండో స్థానంలో ఉంది. 8.3 పాయింట్స్ తో ‘రాచ్చసన్’ మూడో స్థానంలోనూ, 8.6తో మణిరత్నం ‘నాయకన్’ నాలుగో స్థానంలోనూ, మణిరత్నం మరో చిత్రం ‘దళపతి’ 8.5 పాయింట్స్ తో ఐదో స్థానంలోనూ నిలిచాయి. కొన్నిసార్లు పాయింట్స్ ఎక్కువగా ఉన్నా స్థానాల్లో తేడా రావడానికి ఓ నిర్ణీత కాలంలో సదరు చిత్రం వ్యూయర్ షిప్ చూసి రేటింగ్ నిర్ణయిస్తారు.
Also Read
- Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
- Bhairavi Aarthya : పర్ఫెక్షన్ కోసం టాలీవుడ్ కొత్త హీరోయిన్ భైరవి సంచలనం!
- Varalaxmi Sarathkumar : నేను అరవను కరుస్తా...డైరెక్టర్'కు వరలక్ష్మీ స్ట్రాంగ్ కౌంటర్
- Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్... స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Read Also: టిక్‌టాక్ స్టార్ దుర్గారావు నెలకు అంత సంపాదిస్తున్నాడా?
మళయాళ చిత్రసీమవైపు చూస్తే..1993లో రూపొందిన ‘మణిచిత్రతాళ్’ 8.5 పాయింట్స్ తో నంబర్ వన్ స్థానంలో నిలచింది. దాని తరువాతి స్థానంలో ‘సందేశం’ 8.5 పాయింట్స్ తోనే ఉంది. 1989లో తెరకెక్కిన మోహన్ లాల్ ‘కిరీడం’ 8.4 పాయింట్స్ తో మూడో స్థానంలోనూ అవే పాయింట్స్ తో 2021లో విడుదలైన ‘#హోమ్’, ‘కుంబలంగి నైట్స్’ తరువాతి స్థానాల్లో నిలిచాయి. మన తెలుగు సినిమాల విషయానికి వస్తే.. ‘కేరాఫ్ కంచరపాలెం’ చిత్రం 8.4 పాయింట్స్ తో మొదటి స్థానంలో నిలచింది. కాగా 1957 నాటి విజయావారి అపురూప చిత్రం ‘మాయాబజార్’ 8.3 పాయింట్స్ తో రెండో స్థానం ఆక్రమించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ‘జెర్సీ’ 8.3 పాయింట్స్ తో మూడో స్థానంలోనూ, 8.2 పాయింట్స్ తో ‘నువ్వు నాకు నచ్చావ్’ నాలుగో స్థానంలోనూ, అవే పాయింట్లతో ‘సీతారామం’ ఐదో స్థానంలోనూ నిలిచాయి.
దక్షిణాదిన ఎటు చూసినా ఈ మధ్య కాలంలో 9కి పైగా పాయింట్స్ సాధించిన సినిమాలేవీ అంతగా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో కన్నడ చిత్రం ‘కాంతార’ ఏకంగా 9.5 పాయింట్లతో అగ్రగామిగా నిలవడం అన్నది విశేషమే. మరి ఈ సినిమా మునుముందు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో కానీ రన్నింగ్‌లో మాత్రం ఏలాంటి సంచలనం సృష్టించలేదని తేలిపోయింది. ఎందుకంటే ఈ సినిమాను వారానికే హైదరాబాద్‌లో టెర్మినేట్ చేస్తూండడం గమనార్హం.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్‌లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్‌లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!