కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో రీజనల్ సినిమాగా రిలీజ్ అయ్యి, అక్కడ హిట్ అయ్యి తర్వాత వైల్డ్ ఫైర్ లా పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఈ మూవీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ కి కొన్ని రోజుల పాటు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల బాక్సాఫీస్ లు హౌజ్ ఫుల్ అయ్యాయి. రిషబ్ శెట్టి డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది సప్తమీ గౌడ. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా హిట్ కొట్టి గ్రాండ్ డెబ్యూ కొట్టింది సప్తమీ గౌడ. విలేజ్ అమ్మాయిగా, ఫారెస్ట్ డిపార్మెంట్ కానిస్టేబుల్ గా కనిపించిన సప్తమీ గౌడ… రెండు వేరియేషన్స్ లో సూపర్బ్ గా నటించింది. సినిమా మొత్తం ట్రెడిషనల్ డ్రెస్ లోనే కనిపించినా సప్తమీ గౌడ అందానికి యూత్ అంతా ఫిదా అయ్యారు. టిపికల్ ఇండియన్ నేటివిటీ ఫేస్ ఉన్న సప్తమీ గౌడ కాంతార సినిమాలో చీర కట్టులో కూడా గ్లామర్ గా కనిపించింది. కాంతార తర్వాత సప్తమీ గౌడ, వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’లో నటించింది.
సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ మూవీతో సప్తమీ గౌడ మరో పాన్ ఇండియా హిట్ కొట్టాలనుకుంటుంది. ది వ్యాక్సిన్ వార్ హిట్ అయితే సప్తమీ గౌడ రేంజ్ మారిపోతుంది. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయినా సప్తమీ గౌడ చేతిలో ఇంకా సినిమా ఉంది. హోంబలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘యువ’ సినిమాలో సప్తమీ గౌడ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో యువ రాజ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాతో హిట్ కొట్టినా సప్తమీ గౌడ కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ అవ్వడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో కాస్త వీక్ గా ఉండే సప్తమీ గౌడ అప్పుడప్పుడు తన ఫొటోస్ ని పోస్ట్ చేసి యూత్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. లేటెస్ట్ గా ఎల్లో సారీలో ఉన్న ఫొటోస్ ని సప్తమీ గౌడ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోస్ చూసి యూత్ సప్తమీ గౌడ ఫొటోస్ ని వైరల్ చేస్తున్నారు.