Kannappa Trailer : మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ట్రైలర్ వచ్చేసింది. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్, కాజల్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ నటిస్తుండటంతో వారి ఫ్యాన్స్ ఎంతో వెయిట్ చేస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను మంచు విష్ణు, మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Read Also : Ashwini Sri : మా అక్కను పెళ్లి చేసుకుంటే నేనూ వచ్చేస్తా.. హీరోకు అశ్విని శ్రీ ఆఫర్..
పాన్ ఇండియా సినిమాగా దీన్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరుసగా ప్రమోషన్లు చేస్తున్న టీమ్.. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు పెంచడానికి రెడీ అయింది. 2.54 నిముషాల పాటు దీన్ని కట్ చేశారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ పాత్రలు కూడా హైలెట్ అయ్యాయి.