Ashwini Sri : బిగ్ బాస్ ఫేమ్ అశ్విని శ్రీ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఘాటుగా అందాలను ఆరబోస్తూనే ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ హీరోకు బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. తన అక్కను పెళ్లి చేసుకుంటే తాను వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ డ్యాన్స్ షోలో అశ్విని సందడి చేసింది. ఆ షోకు హీరో అడవి శేష్ చీఫ్ గెస్ట్ గా వచ్చాడు.
Read Also : Rahul Ramakrishnan : డైరెక్టర్ గా మారుతున్న మరో స్టార్ కమెడియన్
ఇందులో అశ్విని మాట్లాడుతూ.. మా అక్కకు మీరంటే చాలా ఇష్టం. ఆమె మీకు పెద్ద ఫ్యాన్. ఆమెను పెళ్లి చేసుకోండి. ఆమెను చేసుకుంటే నేను కూడా వచ్చేస్తా’ అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది. దెబ్బకు అడవి శేష్ షాక్ అయిపోయాడు. ఆమె కామెంట్స్ కు నవ్వుకున్నాడు. అయితే ఎలా వస్తానో చెబుతా అంటూ అశ్విని అనగానే.. చాలు చాలు అన్నట్టు సైగ చేశాడు శేష్.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ -7తో బాగా ఫేమస్ అయిన అశ్విని.. అప్పటి నుంచి బుల్లితెర షోలలో బిజీగా ఉంటుంది. కొన్ని ప్రైవేట్ ఈవెంట్లకు కూడా వెళ్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. అడవి శేష్ ప్రస్తుతం రెండు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Read Also : IPL 2026 : 2026 ఐపీఎల్ లో ఇద్దరు కెప్టెన్లు ఔట్..?