Ghost: శివన్న ‘బిగ్ డాడీ’గా వస్తున్నాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేసారు. న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్, ట్విట్టర్ ని షేక్ చేసింది. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. శివన్నతో పాటు ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి కూడా ఘోస్ట్ సినిమాలో నటిస్తుండడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
సందేశ్ నాగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు. కన్నడనాట సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న శివరాజ్ కుమార్, తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడం ఇదే మొదటిసారి. ఇప్పటికే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కిచ్చా సుదీప్, యష్, రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టిలు బౌండరీలు దాటి కొత్త మార్కెట్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా మేకర్స్ ‘బిగ్ డాడీ’ గ్రాండ్ డెబ్యూ ఇవ్వబోతున్నాడు రెడీగా ఉండండి అంటూ మేకర్స్ ట్వీట్ చేసారు. జులై 12 ఉదయం 11:45 నిమిషాలకి టీ సీరీస్ యుట్యూబ్ ఛానెల్ లో ఘోస్ట్ టీజర్ బయటకి రానుంది. బిగ్ డాడీ పాత్రలో కనిపించనున్న శివన్న, టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో గన్ పట్టుకోని సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. మరి సూపర్ స్టార్ శివన్న కూడా ‘ఘోస్ట్’ సినిమాతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి న్యూ పాన్ ఇండియా హీరో అవుతాడేమో చూడాలి.
Also Read
- Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో 'హాయ్ నాన్న' డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
- Tharun - Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ - ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
- Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Bollywood : సూపర్ హీరో కథలపై బాలీవుడ్ స్టార్ హీరోస్ మోజు
"When Violence Dies, Big Daddy Is Born”
Don't miss the grand debut on #July12 at 11:45am on the
T-Series YouTube channel. Join the excitement and embrace #GHOST as we welcome the mighty #BIGDADDY!"@NimmaShivanna @SandeshPro @baraju_SuperHit @TSeries @ArjunJanyaMusic pic.twitter.com/EApTABjlY9— SRINI (@lordmgsrinivas) July 9, 2023
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi Income: 18 ఏళ్లు నిండకుండానే కోట్లలో సంపాదన.. వైభవ్ సూర్యవంశీ రోజుకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..
-
Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
-
Imran Khan: మరో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య.. వరుడు ఎవరంటే..!
-
Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!