పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. దాదాపు సగభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగిలిన పోర్షన్ కు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. దాదాపుగా ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై బజ్ ను పెంచాయి. గతనెలలో ఈ సినిమా నుండి స్వయంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆలపించిన మాట వినాలి అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా అద్భుత స్పందన లభించింది.
Also Read : Masthan Sai : రెండో రోజు కొనసాగుతున్న మస్తాన్ సాయి కస్టడీ..
ఇక నేడు వాలంటైన్స్ డే ను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబందిచిన మరొక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు నుండి సెకండ్ సాంగ్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ‘ కొల్లగొట్టిందిరో’ అనే సాగె లిరికల్ సాంగ్ ను ఈ నెల 24 న మూడు గంటలకు విడుదల చేస్తున్నాం అని తెలియజేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నిధి అగార్వల్ తో ఉన్న స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఆస్కార్ విన్నర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుస్తుండగా సూర్య మూవీస్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. పవన్ సరసన అందాల భామ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ఇదివరకే ప్రకటించారు మేకర్స్.