Swathi Sathish: వికటించిన సర్జరీ.. నటి ముఖం మొత్తం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర పరిశ్రమ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజులు మాత్రమే అవకాశాలు ఉంటాయి.. పేరు ఉంటుంది.. డబ్బు ఉంటుంది. అందుకే ఆ గ్లామర్ కోసం హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. డైటింగ్, వర్క్ అవుట్స్ తో పాటు సర్జరీలు చేయించుకొని మరీ అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఒక నటి సర్జరీ వికటించడంతో మృతిచెందిన విషయం విదితమే.. తాజగా మరో నటికి సర్జరీ వికటించి ముఖం మొత్తం వాచిపోయి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. స్వాతి సతీష్ కన్నడలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో కనిపించింది.
ఇక ఇటీవలే ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకొంది. అయితే ఆ సర్జరీ కాస్తా వికటిచడంతో ఆమె ముఖం అంతా వాచిపోయింది. ఆ ముఖం వాపు రెండు మూడు రోజుల్లో నయమవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మూడు వారాలు అయినా ముఖం వాపు తగ్గలేదు. ముఖం వాపు తగ్గగ పోగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె ముఖం ఉబ్బిన కారణంగా దాదాపుగా ఆమెను ఎవరు గుర్తించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ ముఖంతో తన ఇంటి నుండి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని, తనకు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఆమె కోలుకున్నాక సదురు హాస్పిటల్ పై మరియు డాక్టర్ పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
- Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
- The India Story : కాజల్ అగర్వాల్ 'ది ఇండియా స్టోరీ'కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
- Alia Bhatt: "నా మనసు ముక్కలైంది".. ఆలియా భట్ పోస్ట్ వైరల్!
తాజావార్తలు
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?