Upendra: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం షూటింగ్ సెట్ లో ఆయన శ్వాసకోసం సంబంధిత సమస్యతో బాధపడుతుండగా చిత్ర బృందం ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చెకప్ చేసి కొద్దిసేపటి తరువాత డిశ్చార్జ్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఉపేంద్ర ఒక యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం మట్టి, డస్ట్ ఉన్న చోట షూటింగ్ చేయాల్సివచ్చిందట.. ఉపేంద్రకు మొదటి నుంచి డస్ట్ అలర్జీ ఉండడంతో.. ఆయనకు ఊపిరి అందక ఇబ్బంది పడడంతో వెంటనే చికిత్స కోసం హాస్పిటలకు వెళ్లారట.
ఇక వైద్యులు అంతా నార్మల్ అయ్యాకా పంపడంతో ఉపేంద్ర తిరిగి షూటింగ్ లో పాల్గొన్నారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఉపేంద్ర హెల్త్ కు ఏమైందో అని భయపడుతుండగా తనకేమి కాలేదని ఉపేంద్ర సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. తాను ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు భయాందోళనలకు గురి కావద్దని తెలిపాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఉపేంద్ర నటించిన కబ్జా రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. యూ షూటింగ్ జరుపుకుంటుంది.