Kangana Ranaut: నేనంటే అమితాబ్ కూడా భయమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నోటి దురుసు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనసులో ఏది అనిపిస్తుందో మొహమాటం లేకుండా అదే ముఖం మీద చెప్పేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ అంతా ఒక వైపు ఉంటె కంగనా ఒక్కత్తే ఒక వైపు ఉంది. తన కు నచ్చనివారి గురించి ట్విట్టర్ ద్వారా ఏకిపారేయడం అమ్మడికి అలవాటే.. బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై కంగనా చేసిన కామెంట్స్ ఇప్పటికీ మంటలు రేపుతూనే ఉన్నాయి. ఇక తాజాగా కంగనా.. అమితాబ్ బచ్చన్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్.. ఇటీవల కంగనా నటించిన ‘ధాకడ్’ సినిమా నుంచి ‘షీ ఈజ్ ఆన్ ఫైర్’ అనే పాట టీజర్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ కొద్దీ నిమిషాల తరువాత ఆ ట్వీట్ ను తొలగించారు.
ఇక ఈ విషయమై కంగనా ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. “బాలీవుడ్ లో నాపై చాలామంది కక్ష కట్టారు. వారు నాపై అభద్రతా భావాన్ని ఏర్పరచుకొని నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు. నేనంటే అమితాబ్ బచ్చన్ కూడా భయమేసిందేమో .. అందుకే ట్వీట్ వెంటనే డిలీట్ చేసేశారు.. లేక ఆయనపై ఎవరైనా ఒత్తిడి తెచ్చి డిలీట్ చేయించారో తెలీదు” అంటూ వెటకారంగా మాట్లాడింది. ప్రస్తుతం కంగనా మాటలు నెట్టింట మరో దుమారాన్ని రేపాయి. బిగ్ బి అభిమానులు కంగనాను ఏకిపారేయడం మొదలుపెట్టారు. మరి వ్యాఖ్యలపై బిగ్ బి ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!