‘ఛీటర్స్’ అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?

టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ గా పిలుచుకునే సమంత, నాగ చైతన్య నిన్న విడాకులు తీసుకున్నామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. గాంధీ జయంతి రోజున తమ అభిమానులకు ఈ చేదు వార్తను చెప్పి నిరాశ పరిచారు. నాగార్జున సైతం తనకు ఇద్దరూ ఒక్కటేనని, విడాకుల విషయం వాళ్ళ పర్సనల్ అని, వాళ్లు ఇద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఒకవైపు అక్కినేని అభిమానులు చైతన్యను వదులుకున్నందుకు సమంత ఫ్యూచర్ లో బాధ పడాల్సి వస్తుందని అంటున్నారు. అయితే సమంత మాత్రం అవన్నీ పట్టించుకోవడం లేదు. ‘మై మామ్ సెడ్’ఆ అనే హ్యాష్ ట్యాగ్ తో ఈ బ్యూటీ తన మనసులోని ఆవేదనను బయట పెట్టింది. నాగ చైతన్య కూడా సోషల్ మీడియా వేదికగా విషయాన్నీ వెల్లడించి, తమ వ్యక్తి గత ప్రైవసీని గౌరవించాలని కోరారు. ఇదిలా ఉండగా చై, సామ్ విడాకుల విషయం బయటపడిన కొద్దిసేపటికే హీరో సిద్ధార్థ్ ఒక సెటైరికల్ ట్వీట్ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఆయన ట్వీట్ పై పడడంతో ఆ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటాడన్న ప్రశ్న మొదలైంది.

Read Also : అది వారి వ్య‌క్తిగ‌తం… ఇద్ద‌రూ నాకిష్ట‌మే…

“పాఠశాలలో టీచర్ నుండి నేను నేర్చుకున్న మొదటి పాఠాలలో ఒకటి … మోసం చేసేవాళ్ళు ఎప్పటికీ విజయం సాధించలేరు. మీరేమంటారు ?” అని నెటిజన్లను ప్రశ్నించాడు. అయితే చాలామందికి ఆయన చేసిన ట్వీట్ ఎవర్ని ఉద్దేశించి అన్న విషయం అర్థం కాలేదు. కానీ పూనమ్ కౌర్ మాత్రం ‘నిజమే’ అంటూ రిప్లై ఇవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం సిద్ధార్థ్ ఆ ట్వీట్ సమంతను ఉద్దేశించే చేశాడని అనుకుంటున్నారు. ఎందుకంటే గతంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. శ్రీకాళహస్తిలో ఇద్దరూ స్పెషల్ పూజలు కూడా చేశారు. పెళ్ళి వరకూ వెళ్లిన సమంత, సిద్ధార్థ్ ఏమైందో ఏమో కానీ విడిపోయారు. ఆ తరువాత సామ్ చైని పెళ్లి చేసుకుంది. మరి సిద్ధార్థ్ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశాడో ఆయనే చెప్పాలి.

-Advertisement-'ఛీటర్స్' అంటూ సిద్ధార్థ్ ట్వీట్… ఆ సెటైర్ ఎవరిపై ?

Related Articles

Latest Articles