బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అభిమానులతో నిత్యం టచ్లో ఉండే ఆమె, తరచూ తన అభిప్రాయాలను నేరుగా పంచుకుంటూ చర్చకు దారితీస్తోంది. తాజాగా కంగనా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అభిమానులతో ఓ ఇంటరాక్షన్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా అభిమానులు వేసిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Also Read : Singer mano:‘ముత్తు’ నుంచి ‘శివాజీ’ వరకు..రజనీ మనసు గెలిచిన మనో!
ఓ నెటిజన్ కంగనాను అడిగాడు.. “మీకు రాజకీయాలు ఇష్టమా? లేక సినిమాలా?” అని. దానికి కంగనా నవ్వుతూ సమాధానమిస్తూ, “మనిషి జీవితంలో ఒక్క విషయం మాత్రమే ఇష్టమవ్వాల్సిన పని లేదు కదా! కాలం మారితే మన అభిరుచులు కూడా మారుతాయి. ప్రతి దాంట్లో నేర్చుకునే విషయం ఉంటుంది. నాకు రాజకీయాలు కూడా ఇష్టం, సినిమాలు కూడా ఇష్టం,” అని క్లియర్గా చెప్పింది. ఇక మరో అభిమానుడు కంగనాను అడిగాడు “మీ తదుపరి ప్రాజెక్ట్ ఏంటి? మళ్లీ సినిమాల్లో కనిపించబోతున్నారా?” అని.
దానికి ఆమె మాట్లాడుతూ, “ఓ కథపై ప్రస్తుతం వర్క్ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఆ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. స్క్రిప్ట్ స్టేజ్లో ఉన్నాం’అని వివరించింది. అంతేకాకుండా, మరో నెటిజన్ ఆమె వ్యక్తిగత జీవితంపై ప్రశ్న వేస్తూ “మీ పెళ్లి గురించి ఏమైనా ప్లాన్ ఉందా?” అని అడిగాడు. దానికి కంగనా చమత్కారంగా స్పందిస్తూ, “నా పెళ్లి గురించి ఎన్నో వార్తలు విన్నాను. కానీ వాటిలో ఒకటి నిజం కాదు. పెళ్లి, పిల్లలు వంటి విషయాలు నాకు సూట్ కావు,” అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం కంగనా రాజకీయంగానూ, సినీ రంగంలోనూ తనదైన స్టైల్లో ముందుకు సాగుతోంది. ఏ విషయానికైనా స్పష్టమైన సమాధానం ఇచ్చే ఈ క్వీన్, తన అభిమానులను ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే ఉంటుంది.