Chandramukhi 2: రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలో పి.వాసు దర్శకత్వంలో వచ్చిన చంద్రముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో చంద్రముఖిగా జ్యోతిక నటన నభూతో నభవిష్యత్తు అనే విధంగా ఉంది. ఆమె తర్వాత అలాంటి పాత్రను ఎంతమంది చేసినా కూడా జ్యోతికను మరిపించలేకపోయారు. అంతెందుకు నాగవల్లి సినిమాలో అనుష్క సైతం చంద్రముఖిగా నటించింది. అయినా కూడా చంద్రముఖి అనగానే జ్యోతికనే గుర్తు చేసుకుంటారు అభిమానులు. పెద్ద పెద్ద కళ్ళు.. ఆ హావాభావాలతో జ్యోతిక నిజంగానే చంద్రముఖి ఏమో అనే భావన తెప్పించింది. రారా.. సరసకు రారా అంటూ ఆమె ఆ లుక్ లో పాడుతుంటే.. గుండెల్లో దడ మొదలయ్యేది. దీంతో ఇప్పటివరకు అభిమానులు జ్యోతిక లోని చంద్రముఖిని చూసుకుంటున్నారు.
Don 3: వా.. మాకు షారుఖ్ మాత్రమే కావాలయ్యా..
ఇక ఇప్పుడు చంద్రముఖిగా కంగనా కొత్త అవతారం ఎత్తింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత చంద్రముఖి కి సీక్వెల్ గా చంద్రముఖి 2 ను తెరకెక్కించాడు పి.వాసు. ఈ చిత్రంలో రజనీకాంత్ పాత్రను రాఘవ లారెన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రోమో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసారి చంద్రముఖి 2 లో కంగనా ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తుంది. ఇప్పటివరకు కాంట్రవర్సీ క్వీన్ గా కంగనా ఎంత పేరు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలే కాకుండా పాత్రల విషయంలో కూడా ఆమె ఛాయిస్ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది. ఇక ఈ చంద్రముఖి క్యారెక్టర్ కూడా ఆమెకు ఛాలెంజింగ్ రోల్ అనే చెప్పాలి. పౌరాణిక పాత్రలు కంగనాకు కొత్తేమి కాదు. కానీ, అలాంటి పాత్రలు ఆమె అంతకు ముందు ఎన్ని చేసినా చంద్రముఖి లో ఒక ఎమోషన్ ఉంటుంది. ప్రేమ, పగ రెండు చూపించే పాత్రలో జ్యోతిక జీవించింది. ఇప్పుడే అదే పాత్రలో కంగనా ఎలా నటిస్తోందో చూడాలి. ఈ సినిమాతో కంగనా జ్యోతికను మరిపిస్తుందా.. ? అనేది చూడాలంటే వినాయక చవితి వరకు ఆగాలి. ఆరోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కంగనా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.