Alia Bhatt: ఇష్టం లేకపోతే నన్ను చూడకండి.. స్టార్ హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘బాయ్ కాట్’ దెబ్బ బాలీవుడ్ను ఊపేస్తోంది. తాజాగా ఆలియా భట్ ఓ ఇంటర్వ్యూలో ‘సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టడం తప్పా? మీకు నేను ఇష్టం లేకపోతే నన్ను చూడొద్దు. నేనేమీ చేయలేను’ అని పేర్కొంది. దీంతో ఆలియా వ్యాఖ్యలపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె నటించిన ‘బ్రహ్మాస్త్ర’ను బాయ్కాట్ చేద్దామంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఇలాగే మాట్లాడటం దుమారం రేపుతున్నవిషయం తెలిసిందే.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సమయంలో బాలీవుడ్ మాఫియా, నెపోటిజంపై విమర్శలు వెల్లువెత్తింది. ఆమిర్‌ఖాన్ లాల్‌సింగ్‌చడ్డా విడుదల సమయంలో నిప్పురవ్వలా మొదలైన బాయ్‌కాట్ ట్రెండ్ కార్చిచ్చులా మారింది. ఆ సినిమా వసూళ్లపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. దాంతో.. ఆ చిత్ర కథానాయిక కరీనాకపూర్ ఇష్టం లేకపోతే సినిమా చూడటం మానేయండి అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారమే రేపాయి. ఇప్పుడు ఇదే విషయంలో అలియా కూడా నోరు జారడంతో ట్రోలింగ్ ఇటువైపు మళ్లింది. నటి అలియా మాటల వల్ల ఇప్పుడు ఆ సెగ బ్రహ్మాస్త్ర కు తగిలేలా ఉంది. ఇక ఈ సినిమా మొత్తం మూడు భాగాల్లో రానుంది.. తొలి భాగం శివను సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసినిమాలో.. రణ్‌బీర్, అలియా, నాగార్జున, అమితాబ్ ఇలా పెద్ద తారలే నటిస్తున్నారు. బ్రహ్మస్త్ర సినిమాకు మొత్తంగా రూ.500 కోట్ల ప్రాజెక్టు ఇది, ఇంత పెద్ద సినిమా విడుదల ముందు అలియా మాటలు ఆ చిత్ర యూనిట్‌కు తలనొప్పిగా మారాయి. ఇక ప్రస్తుతం బాలీవుడ్‌లో నెలకొన్న పరిస్థితులు చూసి కూడా అలియా ఇలా మాట్లాడటం సరికాదని చిత్ర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈనేపథ్యంలో.. ఈసినిమా విడుదలకు ఇంకా సమయం ఉండటంతో ఇది మరుగున పడుతుందా? లేక నివురుగప్పిన నిప్పులా ఉండి.. బ్రహ్మాస్త్రకు సెగ తగులుతుందా? అనే విషయమై వేచి చూడాలి.
ICC Rankings: జింబాబ్వేపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్.. టీమిండియా ర్యాంక్ పదిలం
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్‌బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
-
Telangana Health Department: ఆరోగ్యశాఖలో భారీగా ఉద్యోగాలు.. 1,931 పోస్టులకు మెరిట్ లిస్ట్ విడుదల
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!