లోకనాయకుడు కమల్ హాసన్ నుంచి వచ్చిన రీసెంట్ సినిమా ‘విక్రమ్’ విజయవంతంగా దూసుకుపోతోంది. అంచనాలకు మించే ఈ సినిమా ప్రేక్షకుల్ని విస్తృతంగా ఆకట్టుకుంది. కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ తమ అద్భుత నటనా ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరించారు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఓ డిఫరెంట్ అనూభూతిని ఇచ్చాడు. ఇదంతా ఒకత్తైతే.. చివర్లో సూర్య మెరిసిన గెస్ట్ రోల్ మరో ఎత్తు. సూర్య రాకతో థియేటర్లన్నీ దద్దరిల్లిపోయాయి. సూర్య గెస్ట్ రోల్‌లో ఖైదీ సీక్వెల్‌కి హింట్ ఇచ్చిన లోకేష్.. ఈ సినిమాతో మాఫియా ట్రైలాజీకి తెరలేపాడు. ఈ నేపథ్యంలోనే.. అభిమానులు ‘విక్రమ్’కి సీక్వెల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. సీక్వెల్ ఉండొచ్చని కమల్ కూడా హింట్ ఇచ్చారు.
ఇప్పుడు అఫీషియల్‌గా విక్రమ్ సీక్వెల్ తీయబోతున్నామని కమల్ హాసన్ వెల్లడించారు. ఈ సినిమాను ఇంతలా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. ఈ ప్రయాణం కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. ‘‘తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మంచి సినిమాల్ని ఆదరిస్తారు. అలాగే మంచి ఆర్టిస్ట్‌ని ఆదరించి, సపోర్ట్‌గా నిలుస్తారు. ఇప్పుడు విక్రమ్‌ని మీరు ఆదరించడం, ఈ సినిమా చేసుకున్న భాగ్యం. అలాగే పెద్ద హిట్ ఇచ్చి నన్ను ఆదరించడం నా అదృష్టం. నా మీద అభిమానంతో సూర్య ఈ సినిమాలో నటించాడు. అతని మూడు నిమిషాల గెస్ట్ రోల్ థియేటర్స్ దద్దరిల్లిపోయేలా చేసింది. అందుకు కృతజ్ఞతగా, మేమిద్దరం కలిసి నటించబోయే తర్వాతి సినిమాలో చూపిస్తాను’’ అని కమల్ హాసన్ అన్నారు.
అలాగే.. ‘‘డైరెక్టర్ లోకేష్‌కు ఈ సినిమా మీద, నా మీద ఉన్న ప్రేమ ప్రతిరోజూ షూటింగ్‌లోనూ, ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపించేది. ఫ్యాన్స్ కూడా అంతే ఆదరణ ఇస్తున్నారు. ఈ ప్రేమ ఎప్పటికీ కొనసాగుతుంది’’ అని కమల్ హాసన్ ముగించారు. కాకపోతే.. ఈ సీక్వెల్ వెంటనే కార్యరూపం దాల్చుకుంటుందా? లేదా? అన్నది క్లారిటీ ఇవ్వలేదు. తన విక్రమ్ సీక్వెల్‌లో సూర్య కూడా ఉంటాడని ఈ లోకనాయకుడు చెప్పకనే చెప్పేశారు. ఇది నిజంగా అభిమానులకి పండగలాంటి వార్తేనని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు.
Thank you
With love ,
Kamal Haasan@ikamalhaasan @Dir_Lokesh @Suriya_offl @VijaySethuOffl #FahadhFaasil @anirudhofficial #Mahendran @RKFI @turmericmediaTM @spotifyindia @SonyMusicSouth @actor_nithiin @SreshthMovies @anbariv @girishganges @philoedit @ArtSathees @MrRathna pic.twitter.com/W63PyzJxbi— Raaj Kamal Films International (@RKFI) June 7, 2022