సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ మరోసారి ఆసుపత్రిలో చేరినట్టు తెలుస్తోంది. గత ఏడాది నవంబర్ లో కరోనా సోకడంతో ఆయన పది రోజులకు పైగానే ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. యూఎస్ నుండి తిరిగి వచ్చిన వెంటనే కోవిడ్ -19కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కమల్ చికాగోలో తన దుస్తుల లైన్ ‘హౌస్ ఆఫ్ ఖద్దర్’ని ప్రారంభించాడు. అనంతరం అక్కడి నుంచి ఇండియా తిరిగి రాగానే కోవిడ్ ఉన్నట్టుగా తేలింది. ఇక ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వెంటనే కమల్ తమిళ ‘బిగ్ బాస్’ తాజా సీజన్ ను హోస్ట్ చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు మరోసారి కమల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు అనే విషయం ఆయన అభిమానులను ఆందోళకు గురి చేస్తోంది. కానీ ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం. జనరల్ చెకప్ అనంతరం కమల్ ఇంటికి వెళ్లనున్నారు. కాబట్టి ఆయన అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే కమల్ ఆసుపత్రిలో చేరారన్న విషయంపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు.
Read Also : స్కామ్‌స్టర్ ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తా… డైరెక్టర్ వార్నింగ్
ఇక కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే… ఆయన ఇప్పుడు “విక్రమ్”, “ఇండియన్-2” సినిమాలు చేస్తున్నారు. “విక్రమ్” సినిమాలో కమల్ హాసన్ తో పాటు మరో ఇద్దరు సౌత్ స్టార్స్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కలిసి కనిపించబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మార్చ్ 31న విడుదలకు సిద్ధమవుతోంది.